జిల్లా లోని రైతులు ఆయిల్ ఫామ్ సాగు పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన తెలిపారు

జిల్లా లోని రైతులు ఆయిల్ ఫామ్ సాగు పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డి హరిచందన తెలిపారు.

జిల్లా లో ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఒకే రకమైన పంట కాకుండా తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం   ఇచ్చే పంటలను సాగు చేయాలన్నారు. ఆయిల్ ఫామ్  సాగు చేస్తే ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుందని అదే విధంగా వీటికి మార్కెట్లో చాలా డిమాండు ఉందని  సూచించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ మరికల్ మండలం కనుమనుర్లో  రైతులు వి రఘు, సుధాకర్ కృష్ణ రెడ్డి సాగు చేస్తున్న వివిధ రకాల తోటలను, పంటలను జిల్లా కలెక్టర్ డి హరిచందన పరిశీలించారు. మరికల్ మండలం లో దండు నారాయణరెడ్డి  సుమారు 40 ఎకరాలలో  ఎర్ర చందనం, శ్రీగందం మరియు బొప్పాయి తోటలను పరిశీలించారు. కనుమనుర్ గ్రామం లో స్వర్ణ సుధాకర్ రెడ్డి 6 ఎకరాలలో పండిస్తున్న అయిల్ ఫార్మ్ తోట ను పరిశీలించి మొక్క కు మొక్కకు మధ్య లో వేరే పండ్ల చెట్లను సాగుచేయలని రైతుకు సూచించారు. జిల్లా లో రైతులు అయిల్ ఫార్మ్ తోటలు వేసుకోవాలని ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ లను అందించడం జరుగుతోందని తెలిపారు. ఇతర జిల్లా లకు సందర్శన వెళ్లే బదులు జిల్లా లో సాగు చేస్తున్న వారి దగ్గరకు ఇతర మండల కు చెందిన రైతులను ఇలాంటి వాటిని చువించాలని ఆయిల్ ఫార్మ్ తోట మద్యలో అంతర పంటలు వేసుకొనే అవకాశం ఉంటుందని రైతులకు అధిక లాభాలు చేకూరుతాయని సూచించారు.  కనుమనుర్ కంటే ముందు మరికల్ మండల కేంద్రానికి సమీపాన రాఘవేంద్ర అనే రైతు 2 ఎకరాల పొలం లో భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియ తెలంగాణా సిరి వాడి  DAP లను వాడకుండా  వారి పంటసాగు చేస్తున్ననని పొలాన్ని పరిశీలించి రైతును జిల్లా కలెక్టర్ అభినందించారు.  ఇతర రైతులకు కూడా ఇలాంటి పంటలు సగుచేసెల చర్యలు తీసుకోవాలని  అధికారులకు తెలిపారు. సేంద్రియ పంటల వలన ఆరోగ్యంగా ఉంటారని జిల్లా లో రైతులు సేంద్రియ పంటలు వేసుకోవడాని కి ముందుకు రావాలని సూచించారు.

ఈ కార్యక్రమం లో మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్  స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి జహన్ సుధాకర్, ఉద్య్నవన శాఖా అధికారి వెంకటేశ్వర్లు మరియు వ్యవసాయ అధికారులు,  రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post