జిల్లా లో అన్ని సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక, చేయూత పథకాలు అర్హులైన లబ్దిదారులకు, పంట రుణాలు రైతులకు, విద్యకు సంబందించిన రుణాలు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు కృషి చేయాలనీ, బ్యాంకర్లు మండల సమావేశాలలో పాల్గొని బ్యాంక్ ఋణలపై ప్రజలకు అవగాహన కలిపించాలని జిల్లా జాడ్పి చైర్మెన్ సరితా తిరుపతయ్య , జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                        తేది:07-12-2022

జిల్లా లో అన్ని సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక, చేయూత పథకాలు అర్హులైన లబ్దిదారులకు, పంట రుణాలు రైతులకు, విద్యకు సంబందించిన రుణాలు  సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు కృషి చేయాలనీ, బ్యాంకర్లు  మండల సమావేశాలలో పాల్గొని బ్యాంక్ ఋణలపై ప్రజలకు అవగాహన కలిపించాలని జిల్లా జాడ్పి చైర్మెన్ సరితా తిరుపతయ్య , జిల్లా కలెక్టర్  వల్లూరు క్రాంతి తెలిపారు.

బుధ వారం    కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు వివిధ కార్పొరేషన్ల రుణాలు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై బ్యాంకర్లతో డిసిసిబి  సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జాడ్ పి చైర్మెన్ మట్లాడుతూ  గ్రామాలలో ఉండే   ప్రజలకు లబ్ది దారులకు అందించే రుణ పథకాలపై పూర్తిగా అవగాహన కలిపించి , అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని,  బ్యాంక్ కు వచ్చే ఎస్ ఎచ్ జి మహిళాలకుఒక టైం లైన్ ప్రకారం  రుణ సదుపాయం కల్పించాలని  బ్యాంకర్లను కోరారు.

జిల్లా  కలెక్టర్ వల్లూరు క్రాంతి   మాట్లాడుతూ రైతులకు అందించే వ్యవసాయ రుణాలను సకాలం లో మంజూరు చేసి నిర్దేశించిన సమయానికి లక్ష్యాన్ని పూర్తి చేయాలని , ఎస్సీ, ఎస్టీ, కార్పొరేషన్ల కింద నిర్దేశించిన రుణాలను వంద శాతం పూర్తి చేయాలని బ్యాంకర్లకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన కింద మంజూరు చేసిన రుణాలను ఇవ్వాలని అన్నారు. ఎస్సి, ఎస్టీలకు పాడి గేదెలు, కూరగాయల వ్యాపారం తదితర పథకాలపై బ్యాంకర్ల దృష్టిసారించి రుణాలు మంజూరు చేయాలన్నారు . నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని, బ్యాంకు లు ఇచ్చే సబ్సిడీల  పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. సంక్షేమ శాఖాధికారులు వారికీ నిర్దేశించిన బ్యాంకులలో పెండింగ్లో ఉన్న, గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంకు అధికారులను తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తీ చేయాలన్నారు. ఎక్కువ మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు. మహిళా అభివృద్ధికి ఎస్.హెచ్.జి గ్రూపులకు నిర్ధేశించిన పద్ధతిలో  రుణాలు మంజూరు చేయాలన్నారు..పీఎంస్వానిది, పీఎంఇజిబివి(ప్రధాన మంత్రి రోస్ గార్ యోజన )క్రింద పెండింగ్ ఉన్న వాటిని వెంటనే క్లియర్ చేయాలనీ, ఎస్సి, ఎస్టీ కార్పొరేషన్ కి సంబందించిన అన్ని పథకాలు  పూర్తీ చేయుటకు కృషి చేయాలని, పంట రుణాలు పంపిణీ, వ్యవసాయ కాలపరిమితి రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు చిన్న, సన్నకారు రైతులకు అందించడానికి కృషి చేసి బ్యాంకర్ లు వారికి ఉన్న లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలనీ   తెలిపారు.

ఆలంపూర్ శాశనసభ్యులు డాక్టర్ అబ్రహం  మాట్లాడుతూ  ప్రజలకు అందించే పథకాలపై అవగాహన కలిపించాలని, సాద్యమైనంత వరకు యువతకు  లోన్లు మంజూరు చేయాలనీ, వ్యవసాయం రైతులకు, వివర్స్ కు లోన్లు మంజూరు చేసి సహకారామందించాలని బ్యాంకర్లను  కోరారు.

 

అనంతరం నాబార్డ్ ద్వారా  2023- 24 సంవత్సరానికి  సంబందించిన వార్షిక రుణ ప్రణాళిక(PLP) విడుదల చేయడం జరిగింది.  క్రాప్ లోన్లు 2647.80 కోట్లు, టర్మ్ లోన్లు 42 9. 9 6 కోట్లు, ఎంఎస్ఎంఇ  కింద లోన్లు 474.47  కోట్లు , వ్యవసాయం 96.02 కోట్లు ,  మొత్తం  4,158.57   కోట్లు మంజూరు అవుతాయనితెలిపారు.

సమావేశం లో  అదనపు కలెక్టర్ (LB) అపుర్వ్ చౌహాన్ ,ఎల్.డి.ఎం అయ్యపు రెడ్డి, ఆర్.బి.ఐ తేజ్ దీప్త బెహారా,

నాబార్డ్ ఎజిఎం శ్రీనివాస్, ఎస్.బి.ఐ ,ఎపిజివిబి ,యూనియన్ బ్యాంక్ ,కెనరా బ్యాంకు ,ఇండియన్ బ్యాంకు మేనేజర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————————-

.జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి  చేజారి చేయబడినది.

 

Share This Post