జిల్లా లో ఆయిల్ ఫాం తోటల పెంపకానికి ప్రోత్సాహం జిల్లా కలెక్టర్ శృతి ఓజా.

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

పత్రికా ప్రకటన                                                                     తేది: 03-08-2021

జిల్లా లో ఆయిల్ ఫాం తోటల పెంపకానికి  ప్రోత్సాహం జిల్లా కలెక్టర్ శృతి ఓజా.

  మంగళ వారం  ఆయిల్ ఫాం యూనిట్ సాగులో సాధన దిశ గా జిల్లా ఉద్యానవన శాఖ మరియు వ్యవసాయ శాఖ   అధికారులు చేపట్టిన విజ్ఞాన యాత్రకు సంబందించిన  రెండు  ఆర్ టి సి బస్సులను  జిల్లా కలెక్టర్ శృతి ఓజా జెండా ఊపి ప్రారంభించారు.

జిల్లా ఉద్యానవన శాఖ మరియు వ్యవసాయ శాఖ  ఆధ్వర్యం లో చేపట్టిన విజ్ఞాన యాత్రను జిల్లా కలెక్టర్ ప్రారంభించి,  మాట్లాడుతూ గుర్తించిన అనువైన భూములలో  ఆయిల్ పాం తోటలను అభివృద్ధి చేయడానికి, ఆయిల్ పాం సాగు పై అవగాహన పెంపొందించుకొడానికి ఖమ్మం జిల్లా అశ్వరావుపేట లోని ఆయిల్ పాం యూనిట్ సాగు క్షేత్రాన్ని మరియు ఆయిల్ పాం ఉత్పత్తి కర్మాగారాన్ని సందర్శించి, ఆయిల్ పాం సాగు పై విజ్ఞానం పెంచుకోవాలని  తెలిపారు. ఈ  విజ్ఞాన యాత్ర లో గద్వాల, మల్దకల్, ఇటిక్యాల,  ధరూర్, కె.టి.దొడ్డి మండలాల ఎ.ఈ.ఓ. లు మరియు ఎ.ఓ. లు వీరితో పాటు ఉద్యానవన శాఖ అధికారులు జిల్లా నుండి మొత్తం 70 మంది పాల్గొంటున్నారని, రెండు రోజుల పాటు విజ్ఞాన యాత్ర కొనసాగుతుందని  తెలిపారు.

జిల్లా లోని ఆయిల్ పాం యూనిట్ లను పూర్తి స్థాయి లో అభివృద్ధి పరచాలని, వచ్చే సంవత్సరం జిల్లా లో మూడు వేల హెక్టార్లలో ఆయిల్ పాం సాగు చేయలన్నదే ఈ విజ్ఞాన యాత్ర లక్ష్యం అని జిల్లా ఉద్యనవన శాఖ అధికారి  సురేష్ తెలిపారు.

ఈ విజ్ఞాన యాత్ర లో ఉద్యానవన శాఖ అధికారి సురేష్, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, సక్రియ నాయక్, ఏ ఇ ఓ లు , ఏ ఓ లు , తదితరులు పాల్గొన్నారు.

——————————————————————  

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారీ చేయడమైనది.

Share This Post