జిల్లా లో ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం మొత్తం విద్యార్థులు 17,752 మందికి గాను16,629 హాజరయ్యారు. జనరల్ 15990 మంది విద్యార్థుల కు గాను 899 మంది విద్యార్థు లు గైర్హాజర్ కాగా 15,980 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ మొత్తం విద్యార్థులు ఒక వెయ్యి 772 మందికి గాను 1548మంది విద్యార్థులు హాజరుకాగా, 224 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారు. కాగా జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రఘురాజ్ 5 పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసి పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలోని ఆర్య నగర్ ఎస్ ఆర్ జూనియర్ కళాశాల, శ్రీ మేధా వి జూనియర్ కళాశాల , కాకతీయ కళాశాల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు .అలాగే హైపవర్ కమిటీ చిన్నయ్య ఆధ్వర్యంలో 5 పరీక్ష కేంద్రాలు, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీ రవికుమార్, శ్రీ చిరంజీవి, శ్రీమతి కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో 9 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు .అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ శ్రీ నారాయణ ఆధ్వర్యంలో 10 పరీక్ష కేంద్రాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 18 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో సిబ్బంది పూర్తిస్థాయిలో పకడ్బందీగా పనిచేశారని జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రఘు రాజు తెలియజేశారు .పరీక్ష లు సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన పోలీస్ విభాగము , రెవెన్యూ విభాగం అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల కు, ఆర్టీసీ అధికారుల కు జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ రఘురాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Share This Post