జిల్లా లో ఇసుక అక్రమ రవాణను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                తేది 06-01 -2022

జిల్లా లో ఇసుక అక్రమ రవాణను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అక్రమంగా సృష్టిస్తున్న ఇసుక డంప్ లను తగ్గించాలని, ఇసుక అక్రమ రవాణ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఉన్న ఇసుక రీచ్లకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు. పెట్రోల్ ధరలు పెరిగినందున ఇసుక రవాణ చేసే MIV వాహనాల చార్జి లు, ఇసుక రవాణాకు సంబంధించిన కూలీల చార్జి లు  పెంచడం పై  సంబంధిత అధికారులతో చర్చించారు. పోలీస్  , రెవెన్యు , మైన్స్ అధికారులు సమన్వయము చేసుకొని ఇసుక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ పనులకు  ఇసుక కొరత లేకుండా అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. ఇసుక తరలించే వాహనాన్ని చెక్ చేయాలనీ, వాహనానికి ఆన్లైన్ లో  బుక్ చేసిన స్లిప్ కచ్చితంగా ఉండేలా చెక్ చేయాలనీ అన్నారు. ఇటిక్యాల, అయిజ, మనపాడు, ఉండవెల్లి, మండలాల తహసిల్దార్ లతో ఇసుక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇసుక తవ్వే ప్రాంతాలలో  వి ఆర్ ఏ లను డ్యూటీ వేసి  రాత్రి సమయాలలో  పర్యవేక్షణ  నిర్వహించాలని అన్నారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, ఆర్.డి.ఓ రాములు, డి ఎస్ పి రంగ స్వామి, ఏ డి మైన్స్ అధికారి విజయ రమ రాజు, ఇరిగేషన్ విజయ మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి,  మోహన్, చక్రవర్తి , శ్రీనివాసులు, ఈ.ఈ ప్రగతి, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  జిల్లా గారిచే జారీ చేయనైనది.

Share This Post