జిల్లా లో ఉండే అంగన్వాడి సెంటర్ల లో పిల్లలు బరువు, పొడవు పెరిగే విదంగా పౌష్టికాహారం అందించి, శ్యాం, మ్యాం పిల్లలకు సంబందించిన వివరాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేసే బాద్యత అంగన్వాడి టిచర్లదే నని , ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో సిడిపివోలు ,సూపర్వైజర్లతో జరిగిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ అంగన్వాడి పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వారం రోజుల నుండి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసానని, ఎక్కడ కూడా అనుకునంత ప్రోగ్రెస్ లేదని, సంబందిత గ్రామ ప్రజల నుండి ఎస్ ఎం ఎస్ వస్తుందని అన్నారు. సూపర్ వైసర్లు, సి డి పి ఓ లు ఫీల్డ్ లో తిరిగి అంగన్వాడి సెంటర్లను తనికి చేసి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేందుకు తగు జాగ్రతలు తీసుకోవాలని అన్నారు. పరిసరాల పరిసుబ్రత పాటించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజరు శాతం లేదని, గర్భిణీ స్త్రీల పేర్లను నమోదు చేయడం లేదని అన్నారు. గర్భిణీ స్త్రీలు ఎక్కడ నమోదు చేసుకొని ఎలా వైద్యం చేయించుకుంటున్నారు. అనే అంశాలపై కలెక్టర్ సిడిపివోలతో చర్చించారు. ప్రతి అంగన్వాడి టీచర్ బాధ్యతతో విధులు నిర్వహించాలని, ఆయా గ్రామాల ప్రజల నుండి వచ్చిన మెసేజ్ల ద్వారా అంగన్వాడి కార్యకర్తలు సరిగ్గా విధులు నిర్వహించడం లేదని తెలుస్తున్నదని కలెక్టర్ తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ కింద బాల కార్మికులను ఎంత మందిని గుర్తించారని, వాటికీ సంబందించిన ఫైల్స్ అన్ని చెక్ చేశారు. జిల్లా లో ఆపరేషన్ ముస్కాన్ కింద 55 మందిని రెస్కు చేశామని , 18 మంది డ్రాప్ అవుట్ అయ్యారని, మిగతా వారందరు స్కూల్స్ కు వేలుతునారని cwc అధికారులు తెలుపగా , వాటికీ సంబందించిన ఫైల్స్ అన్ని పరిశీలించారు. ఆపరేషన్ ముష్కాన్ కింద గుర్తించిన బాల కార్మికులను విడిచి పెట్టేటపుడు గ్రామ సర్పంచ్ సూరిటి, చదువుకున్న పిల్లలైతే స్కూల్ హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. వారిని స్కూల్స్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, పిల్లల తల్లి తండ్రులకు అవగాహన కల్పించాలని తెలిపారు. బాల కార్మిక నిర్మూలన కోసం ప్రభుత్వం ఎంతో శ్రమ చేస్తున్నదని , అందరు తమ వంతు బాద్యత గ పని చేయాలనీ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ వికలాంగుల అధికారి ముశాయిధబేగం, cwc చైర్మెన్ సహదేవులు, హేమలత , శైలజ ,సి డి పి ఓ లు కమలాదేవి, సుజాత , నర్శింహ, తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————-
పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారీ చేయబడినది.