జిల్లా లో ఉండే ప్రభుత్వ మరియు ప్రవేట్ ఆసుపత్రులన్ని, బయో మెడికల్ వేష్టేజి మరియు పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ కింద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాష తెలిపారు.

పత్రికా ప్రకటన                                                         తేది: 26-04 -2022

 

జిల్లా లో ఉండే ప్రభుత్వ మరియు ప్రవేట్   ఆసుపత్రులన్ని, బయో మెడికల్ వేష్టేజి మరియు పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ కింద తప్పనిసరిగా  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఇంచార్జి  కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాష తెలిపారు.

మంగళవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  జిల్లా వైద్యదికారులు,  మరియు  జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు, బయో మెడికల్ వేష్టేజి  కంపెనీ వారితో ఏర్పాటు చేసిన సమావేశం లో  ఆమె మాట్లాడుతూ  జిల్లా లో ప్రవేట్ ఆసుపత్రులు 40, డెంటల్ 13, ఫిజియోతెరఫీ క్లినిక్ లు 4, డయాగ్నొస్టిక్ సెంటర్లు 79 , క్లినిక్స్ 16  మొత్తం 152  ఉన్నాయని, వాటిలో 68  మాత్రమే బయో మెడికల్ వేష్టేజి మరియు పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ కింద రిజిస్ట్రేషన్  చేసుకున్నారని , మిగతా  ఆసుపత్రులను   కూడా  తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. జిల్లా ఆసుపత్రి లో  ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని నియమించాలని అన్నారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు అన్ని ప్రవేట్ ఆసుపత్రుల పర్యవేక్షణ కొరకు నోడల్ అధికారిని నియమించి  ఈ ప్రకియను పూర్తి చేసేలా చూడాలని జిల్లా వైద్య అధికారికి ఆదేశించారు.  ఎవరైతే ఇప్పటి వరకు బయో మెడికల్ వేష్టేజి మరియు పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ కింద  రిజిస్ట్రేషన్ చేసుకోలేని వారికీ నోటీసులు జారి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. నోటీసులు ఇచిన కూడా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేని  ఆసుపత్రులను  బయో మెడికల్ వేష్టేజి మరియు పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ చట్ట ప్రకారం సీజ్ చేయాలనీ అధికారులకు ఆదేశించారు. స్వేతాంష్ కంపెనీ వారు  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి  బయో మెడికల్ వేష్టేజి ని  తీసుకేళ్ళు టకు  ప్రతి నెలకు  6000 రూ.  ఫైనల్ చేయడం జరిగిందని తెలిపారు.     వెటర్నరీ, ప్రభుత్వ, ప్రవేట్ ఆసుపత్రుల యజమాన్యానికి  మరియు సిబందికి  అందరికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష,  అడిషనల్ ఎస్ పి  రాములు నాయక్, బాష్కర్ రెడ్డి, డాక్టర్ రామచంద్రా రెడ్డి, డాక్టర్ ఇర్షాద్, డాక్టర్ కిషోర్  , పశు వైద్యదికారి వెంకటేశ్వర్లు,  ఎన్విరాన్మెంటల్  ఇంజనీర్ దయానంద్, బయో మెడికల్ అసిస్టెంట్ విజయ్, మధుసూదన్ రెడ్డి, బాష్కర్ రెడ్డి  సంబదిత అధికారులు ,తదితరులు పాల్గొన్నారు.

 

———————————————————————————–          జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ జిల్లా గారి  జారి చేయనైనది.

 

 

 

 

 

 

 

 

 

Share This Post