జిల్లా లో ఉండే వీఆర్వోలు వారికి కేటాయించిన ప్రభుత్వ శాఖలో మంగళవారం మధ్యాహ్నం వరకు విధులలో చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు.

జిల్లా లో ఉండే  వీఆర్వోలు వారికి కేటాయించిన ప్రభుత్వ శాఖలో మంగళవారం మధ్యాహ్నం వరకు విధులలో చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు.

సోమవారం  రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జి ఓ 121 ప్రకారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు  వివిధ ప్రభుత్వ శాఖలలో వీఆర్వోలను భర్తీ చేసేందుకు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని డిప్పు ద్వారా ఆయా శాఖలకు వీఆర్వోలను కేటాయించారు. కేటాయించిన శాఖలలో చేరేందుకు ఉత్తర్వులను సిద్ధం చేసి వీఆర్వోలకు అందజేయాలని కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని 95 మంది వీఆర్వోల ను వివిధ  ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులలో వారిని భర్తీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పి సి ఇ ఓ విజయనాయక్,  డి పిఓ శ్యాంసుందర్, డిఆర్డిఓ నాగేంద్రం, సి పి  ఓ లక్ష్మణ్, పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు,  శిశు సంక్షేమ శాఖ  అధికారి ముశాయిధ బేగం,  వెంకట్ రెడ్డి, మదన్మోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు.

 

———————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాలచే జారీ చేయబడినది

 

 

 

 

 

 

 

 

Share This Post