జిల్లా లో ఉండే 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను వేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శృతి ఓఝా అన్నారు.

పత్రిక ప్రకటన                                                               తేది 23-8-2021

జిల్లా లో ఉండే 1 నుండి 19 సంవత్సరాల  వయస్సు  గల పిల్లలందరికి అల్బెండజోల్  మాత్రలను వేసే  విధంగా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ శృతి ఓఝా అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలు నుండి  వైద్య అధికారులు, జిల్లా అధికారులతో  ఏర్పాటు చేసిన  జూమ్  సమావేశం ద్వారా  మాట్లాడుతూ   ఈ నెల 25-08-2021 నుండి 31 -08-2021 వరకు జరిగే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పకడ్బందిగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా లో 1-19 వయసు గల పిల్లలు 1,97,342 మంది ఉన్నారని, వీరందరికీ   అల్బెండజోల్  మాత్రలను అంగన్వాడి టీచర్ లు మరియు ఆశ వర్కర్ ల ద్వారా మాత్రలను తినిపించే ఏర్పాటు చేయాలన్నారు. కరోనా ఉన్నందున  అంగన్వాడి టీచర్ లు మరియు ఆశ వర్కర్ లు 6 అడుగుల దూరం పాటించి, మాస్క్ లు ధరించి, చేతికి గ్లౌసు లు ధరించటం వంటివి తప్పనిసరిగా పాటించాలన్నారు.  ప్రతి ఇంటికి వెళ్లి 1-2 వయస్సు  గల పిల్లలకు సగం మాత్ర , 2-19 వయస్సు  గల పిల్లలకు ఒక్క మాత్ర తినిపించే విధంగా చర్యలు తిసుకోవాలన్నారు. మాత్రలను ఎట్టి పరిస్థితులలో చేతికి ఇవ్వరాదని,  కరోనా పాజిటివ్ ఉన్న, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి  మాత్రలు ఇవ్వరాదని అన్నారు. ప్రతి పిల్లవాడికి మాత్రలను ఇచ్చే విదంగా  వారి తల్లి తండ్రులకు నులి పురుగుల వ్యాధి , నివారణ ఫై అవగాహన కల్పించి పిలల్లందరికి 100 శాతం అల్బెండజోల్ మాత్రలను అందజేయలన్నారు.  

జిల్లా వైద్య అధికారి డా.చందు నాయక్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం ఉంటుందని,  నులి పురుగుల ద్వారా పిల్లలకు రక్త హీనత ఏర్పడి ఎదుగుదల లోపించడం జరుగుతుందని, అది నివారించాడానికి అల్బెండజోల్  మాత్రలు తినిపించడం జరుగుతుందని , కరోనా నేపథ్యం లో పూర్తి స్థాయి లో జాగ్రతలు పాటిస్తూ పిల్లలకు మాత్రలు తినిపించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.చందు నాయక్, జాడ్పి సిఇ ఓ విజయనయాక్ , జిల్లా సంక్షేమ అధికారి ముశాయిధ బేగం, డి.ఈ.ఓ. సిరాజుద్దీన్, డా.శశి కళ,డాక్టర్ సౌజన్య, మధుసూదన్ రెడ్డి, డి డి ఎం ఆంజనేయులు  ,మెడికల్ ఆఫీసర్ లు తదితరులు పాల్గొన్నారు.

డి పి ఆర్ ఓ జోగుళాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post