జిల్లా లో ఉన్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి రోడ్డు ప్రమాదాలను నివారించాడానికి లైన్ డిపార్టుమెంట్లు తగిన చర్యలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

 పత్రికా ప్రకటన                                                                  తేది : 19-08-2021

జిల్లా లో ఉన్న బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి రోడ్డు ప్రమాదాలను  నివారించాడానికి లైన్ డిపార్టుమెంట్లు తగిన చర్యలు తీసుకుంటే  ప్రమాదాలను తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

గురువారం కల్లెక్టరేట్ సమావేశ హలు నందు ఎస్పి, రవాణ, ఆర్ట్ టిసి , ఎక్సైస్, మున్సిపల్ కమీషనర్, పంచాయత్ రాజ్, ఆర్ అండ్ బి  అధికారులతో జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు హై వే దగరలో ఉన్నందున ప్రమాదాలు ఎక్కువ జరిగే  అవకాశముందని, నిర్మాణం లో ఉన్న రోడ్డు పనులు సెప్టెంబర్ వరకు పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. రోడ్డు భద్రత నియమాల పై ప్రచారం చేసి , ప్రజలకు అవగాహానా కల్పించాలని అన్నారు. ఇప్పటికే గుర్తించిన బ్లాక్ స్పాట్స్ దగ్గర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వాహన దారులు సీట్ బెల్ట్,  హెల్మెట్ కచ్చితంగా పెట్టుకునేలా చూడాలన్నారు. రోడ్ల పై ఉన్న పొదలను తొలగించి , హై మాస్క్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. సైన్ బోర్డులను ఏర్పాటు చేసి, రోడ్డు పై మార్కింగ్స్ చేయాలనీ సూచించారు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్ లను ఏర్పాటు చేయాలన్నారు. డ్రైవింగ్ లో ఫోన్ వాడకుండా ఉండేలా ప్రజలకు తెలియజేయాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని అన్నారు.  ఆర్.అండ్ బి మరియు పోలీస్ అధికారులు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ప్రజలు ప్రజా రవాణను ఎక్కువగా ఉపయోగించుకునేవిదంగా వారికి ప్రజా రవాణ పై పూర్తిగా అవగాహన కల్పించాలని అన్నారు. అందరు కలిసి పని చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

జిల్లా ఎస్పి రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రధాన రహదారుల పై సి.సి టివి కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియమాలను ఉల్లగించే వారి ఫోటో లు తీసి ఆన్లైన్ లో చలాన్ కట్టెలా ఏర్పాట్లు చేసామని తెలిపారు. ఎర్రవల్లి క్రాస్ రోడ్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఎర్రవల్లి నుండి గద్వాల్ వరకు ఉన్న రహదారి పై హై మాస్క్ లైట్లు ఏర్పాటు చేసి, వాహనాల స్పీడ్ ను కంట్రోల్ చేసి , వాహానాలను చెకింగ్ చేసేలా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కఠీనంగా వ్యవరించాలని ఆర్.టి ఎ అధికారులను కోరారు. హైవే పై మందు, లిక్కర్ షాప్ లు ఉండకుండా చూడాలని ఎక్సైస్ అధికారులను కోరారు. ప్రతి రోజు 100 కేసులు ఫైల్ అవుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ పరిధి లో పార్కింగ్ ప్లేస్ లను గుర్తించాలని మున్సిపల్ కమీషనర్ కు ఆదేశించారు. అలంపూర్ చౌరస్తాలో ఆర్.టి.సి డ్రైవర్లకు ఆటోల వారికి గొడవలు జరుగుతున్నందున బస్స్టాప్ నుండి 100 మీటర్ల దూరం లో ఆటోల పార్కింగ్ ఉండేలా చూడాలని  అన్నారు.

ఈ సమావేశం లో జిల్లా రవాణ అధికారి పురుషోత్తం రెడ్డి, ఆర్.టి.సి రీజనల్ మేనేజర్ ఉష, డిపో మేనేజర్ రామ్ మోహన్, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, పంచాయత్ రాజ్ ఈ.ఈ. సమత, ఆర్ అండ్ బి  ఈ.ఈ. ప్రగతి, నేషనల్ హై వే సైట్ ఇంజనీర్ భానుమిశ్రా, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

       జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post