జిల్లా లో ఎక్కడ కూడా అనుమతి లేని నిర్మాణాలు జరగకుండా చుడాలాని జిల్లా కలెక్టర్ శృతి ఓజా మున్సిపల్ కమీషనర్ లకు ఆదేశించారు

పత్రికా ప్రకటన                                                        తేది 11-08-2021

జిల్లా లో ఎక్కడ కూడా అనుమతి లేని నిర్మాణాలు జరగకుండా చుడాలాని  జిల్లా కలెక్టర్ శృతి ఓజా మున్సిపల్ కమీషనర్ లకు ఆదేశించారు.

        బుధవవారం సమావేశం హాలు నందు మున్సిపల్ కమీషనర్ల తో  ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ అప్రూవల్ కోసం  టి ఎస్ – బి పాస్  చట్టాన్ని ప్రవేశ పెట్టిందని, టి.ఎస్. బి- పాస్ ద్వారా వచ్చిన ధరఖాస్తులను పరిశీలించడానికి   రాష్ట్ర స్థాయి లో టి ఎస్ – బి పాస్ కమిటి ఉంటుందని ,  జిల్లా స్థాయి లో కూడా కమిటీ ఏర్పడిందని తెలిపారు. జిల్లా కలెక్టర్, అదనపు కల్లెక్టర్లు , ఎస్పి, ఆర్.&బి ఈ.ఈ., నీటి పారుదల శాఖ ఈ.ఈ., జిల్లా ఫైర్ ఆఫీసర్లతో జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు అయినట్లు తెలిపారు. బిల్డింగ్ పర్మిషన్ కోసం  మీ సేవ లో టి.ఎస్. బి – పాస్ ద్వారా దరకాస్తు చేసుకోవాలని అన్నారు. 75 గజాల నుండి 600 గజాలు , 10 మీటర్ల ఎత్తు ఉన్న వ్యక్తి గత నివాస ప్లాట్ లో   భవన నిర్మాణం కోసం  వచ్చిన దరకాస్తులను డాక్యుమెంటరీ వెరిఫికేషన్ తప్పక చేయాలనీ మున్సిపల్ కమీషనర్లకు  ఆదేశించారు. వెరిఫికేషన్ తర్వాత జరగాల్సిన ప్రాసెస్ ను జిల్లా స్థాయి లో ఏర్పాటు అయిన పోస్ట్ వెరిఫికేషన్ టీం చూసుకోవాలని అన్నారు.  ప్రతి మున్సిపాలిటి లో 4 టీం లను ఏర్పాటు చేయాలనీ అన్నారు. భవన నిర్మాణానికి దరకాస్తు సమర్పించిన తేది నుండి  21 రోజులలో బిల్డింగ్ నిర్మాణానికి  అనుమతి  ఇవ్వాలని అన్నారు.  కోర్టు నుండి స్టే ఆర్డర్ అందుకున్న నిర్మాణాలు ఉంటే పోలీస్ సహాయం తో వాటిని పరిష్కరించాలని అన్నారు.  అనుమతి లేని నిర్మాణాలను మొదటి దశ లోనే గుర్తించి వాటిని కుల్చివేయాలని అన్నారు. మున్సిపాలిటీ పరిధి లో అనుమతి లేని నిర్మాణాలు  జరుగ కుండ చూడాలని  అధికారులకు ఆదేశించారు.

       ఎస్పి రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ కోర్టు నుండి స్టే ఉన్న వాటికి వీలైనంత త్వరగా అనుమతి వచ్చేలా చూస్తామని తెలిపారు.టి ఎస్ బి పాస్ చట్టం  ప్రకారం  తపుడు స్టేట్ మెంట్ చూపించిన వారికీ ఫైన్ వేసి , ఇచిన అనుమతిని రద్దు చేయవచ్చునని, నిర్మాణాలను   కూల్చివేయవచ్చునని అన్నారు.

        రోజుకి 35 నుండి 50 వరకు  ధరఖాస్తులు వస్తున్నాయని మున్సిపల్ కమీషనర్లు తెలిపారు.

ఈ సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ హర్ష , మున్సిపల్ కమీషనర్లు శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, నిత్యానంద్, ఫల్లా రావు, టౌన్ ప్లాన్నింగ్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

————————————————————  

  జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post