జిల్లా లో ఒకటి రెండు ఎకరాలు పట్టా భూములు ఎక్కువ ఉన్న సందర్బాలలో తహసిల్దార్లు చొరవ తీసుకొని దానికి గల కారణాలను పరిశిలించి సమస్య ను పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు.
శనివారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు అన్ని మండలాల తహసిల్దార్లతో ఏర్పాటు చేసిన ససమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక ఎకరం ,రెండు ఎకరాలు ఉన్న ప్రైవేట్ భూములు చాలా పెండింగ్ ఉన్నవని, వాటిని క్లియర్ చేయాలన్నారు. ధరణి టి ఎం 33 లో పరిష్కరించాల్సిన సమస్యను పేర్లు, విస్తీర్ణం , మిస్సింగ్ సర్వే నెంబర్లు ఇతరములు అన్నింటికీ సంబంధించి 407 పెండింగ్ లో ఉన్నవని, మండలం వారిగా వాటిని క్లియర్ చేయాలనీ తహసిల్దార్లకు ఆదేశించారు. జి ఎల్ ఏమ్స్ , సక్సేష న్స్ మ్యుటివే షన్స్ , పి ఓ బి పెండింగ్ ఫైల్స్ అన్ని కూడా వెంటనే క్లియర్ చేయాల్లన్నారు. తహసిల్దార్లు ప్లాన్ ప్రాకారమ ప్రతి రోజు టార్గెట్ పెట్టుకొని పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేయాలన్నారు. ఆర్ ఎస్ ఆర్ వల్ల రిజెక్ట్ చేయడానికి రీసన్ ఉండకుడదన్నారు . మండలాల వారిగా ఏ మండలం లో ఎన్ని పెండింగ్ ఉన్నవని అడిగి తెలుసుకున్నారు. మండలాలలో లో పేర్లు మిస్సింగ్ సర్వే నెంబర్లు ఐడెంటిఫై చేయాలని, ప్రభుత్వ భూములపై ఫోకస్ పెట్ట్లల న్నారు. ఇటిక్యాల, మనవ పాడు మండలాల్లో కేంద్రీయ విద్యాలయం కోసం 10 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించాలన్నారు. ఓటరు జాబితా దరకాస్తు ఫారాలు ఇంతకు ముందు ఉండే ఫార్మ్స్ కాకుండా కొత్త వి వచ్చాయని, వాటిని ప్రింట్ చేసి ప్రతి బి ఎల్ ఓ కి 50 ఫార్మ్స్ పంపిస్తామన్నారు. బి ఎల్ ఓ లకు అవగాహన కార్యక్రమాలునిర్వహించాలని అన్నారు.
సమావేశం లో రెవెన్యూ డివిజనల్ అధికారి రాములు, సి సెక్షన్ సుపరింటేన్దేంట్ రాజు, అన్ని మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.
———————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయబడినది.