పత్రికా ప్రకటన తేది :11 -01-2022
జిల్లా లో కొత్తగా నిర్మించిన ఇ వి ఎం గోదాములో ఇవియంలు , వివిప్యాట్లు , కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్లను క్రమ సంఖ్య ప్రకరము అమర్చాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
మంగళవారం ఉదయం పి.జె.పి క్యాంపు ఆవరణలో ఉన్న పాత ఇ వి ఎం గోదాములో ఉన్న వివిప్యాట్ల, కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్లను రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధుల సమక్షంలో కొత్త గోధములోకి తరలించే ప్రక్రియను పరిశీలించారు. గోదాములో ఉన్న ఎన్నికల సామగ్రిని బౌతిక పరిశీలన చేసిన తరవాతే కొత్త గోధములోకి తరలించాలని, కొత్త గోదాములో గద్వాల్ , ఆలంపూర్ నియోజికవర్గాలకు సంబంధించిన ఇవియంలు , బ్యాలట్ యూనిట్ , కంట్రోల్ యూనిట్, వివిప్యాట్ల ను పకడ్బందిగా భద్రపరచాలని సంబందిత అధికారులకు ఆదేశించారు.
గద్వాల్ నియోజికవర్గానికి సంబంధించి వి.వి. ప్యాట్ లు – 316 , ఆలంపూర్ నియోజికవర్గానికి సంబందించి బ్యాలట్ యూనిట్లు – 1 , వి.వి. ప్యాట్ లు – 298 , మొత్తం 299 ,సి. క్యాటగిరికి సంబంధించి 349, జిల్లాలో బ్యాలట్ యూనిట్ , కంట్రోల్ యూనిట్, వివిప్యాట్లు మొత్తం 964 ఉన్నాయని, వాటిని కొత్త గా నిర్మించిన గోదామునకు తరలించి క్రమ సంఖ్య ప్రకారము ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఆదేశించారు.
కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, ఆర్.డి.ఓ రాములు, మధుసూదన్, టి.ఆర్.ఎస్ సుబాన్, ఉప్పేరు నర్సింహ సి.పి.ఎం, అతికుల్ రెహమాన్ వై ఎస్ ఆర్ సి పి, నర్సింహులు బి.జె.పి, సంబందిత అధికారులు ,తదితరులు ఉన్నారు.
———————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ జిల్లా గారిచే జారీ చేయనైనది.