జిల్లా లో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని వారి పై దృష్టి పెట్టాలని, ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ లిస్టు ప్రకారం చెక్ చేసి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయించాలని, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

పత్రిక ప్రకటన                                                                            తేది:1.11.2021

జిల్లా లో కోవిడ్ వ్యాక్సిన్  వేసుకోని వారి పై దృష్టి పెట్టాలని, ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ లిస్టు ప్రకారం చెక్ చేసి వ్యాక్సిన్ వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్  వేయించాలని, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన కన్వర్జేన్సి సమావేశం లో మాట్లాడుతూ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారి లిస్టు తీసుకొని 84 రోజులు దాటిన తరవాత వారికి తప్పనిసరిగా 2 వ డోస్ వ్యాక్సిన్ వేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. టీకా వేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుందని , ప్రతి ఒక్కరికి టీకా పై అవగాహన కల్పించాలని, జిల్లా లో పెండింగ్ ఉన్న వారందరికీ వాక్సిన్ వేసి, 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేసేలా  చూడాలన్నారు.

జిల్లా లో రెండు అగ్ని ప్రమాదాలు జరిగినందున ఇకపై  ప్రభుత్వ  కార్యాలయాల్లో అగ్ని ప్రమాదం జరగకుండా పకడ్బందిగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యాలయాల్లో లూస్ వైర్లు,  లూస్ కనెక్షన్లను  సరి చేసుకోవాలని, సంవత్సరానికి ఒకసారి విద్యుత్ శాఖ అధికారులతో తప్పనిసరిగా చెక్ చేయించాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా కార్యాలయ సముదాయాన్ని పరిశుబ్రంగా ఉంచుకోవాలని అన్నారు.

గ్రామ   చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (విసిపిసి) సమావేశాలలో స్పెషల్ అధికారులు పాల్గొనాలని, పాటశాలలో పిల్లలు 100 శాతం హాజరు  అయ్యేలా చూడాలని, డ్రాప్ అవుట్ అయిన పిల్లలను పాటశాలకు పంపించే విధంగా వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు.  జిల్లాలో ఈ సంవత్సరం 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు100 శాతం పాస్ అయేటట్లు చూడాలని అన్నారు. పదవ తరగతి చదివే   విద్యార్థులకు స్పెషల్ క్లాసులు, పరిక్షలు నిర్వహిస్తునారా చెక్ చేసి  స్పెషల్ రిపోర్ట్ తయారు చేసి   పంపించాలని జిల్లా విద్యా శాఖ అధికారికి ఆదేశించారు. ఆర్.బి.ఎస్.కే ప్రోగ్రాం పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

తదనంతరం ప్రజావాణి పిర్యాదులను స్వీకరించారు. వివధ అంశాల పై వచ్చిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని పిర్యదుదారులకు హామీ ఇచ్చారు. మొత్తం 50 ప్రజావాణి పిర్యాదులు వచ్చాయని, ఎక్కువగా భూ సమస్యలకు సంబంధించినవి వచ్చాయని, వాటిని సంబందిత అధికారులకు పంపి సమస్యలు పరిష్కారమయ్యే లా చూస్తామని  తెలిపారు.

సమావేశం లో అదనపు కలెక్టర్లు రఘురామ్ శర్మ, శ్రీ హర్ష, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారి చేయబడినది.

 

Share This Post