జిల్లా లో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని వారికి ఆసరా పెన్షన్, రేషన్ ను ఆపేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పెషల్ అధికారులకు ఆదేశించారు.

జిల్లా లో కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని వారికి ఆసరా పెన్షన్, రేషన్ ను ఆపేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పెషల్ అధికారులకు ఆదేశించారు.

సోమవారం కల్లెక్టరేట్ ఛాంబర్ లో అదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, స్పెషల్ అధికారుల తో వాక్సినేషన్ పై ఏర్పాటు చేసిన సమవేశం లో మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. గ్రామాల వారిగా ఎంత శాతం వాక్సినేషన్ పూర్తి అయిందని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితా తయారు చేసి, వారికి వెంటనే ఆసరా పెన్షన్లు, రేషన్ ను ఆపేయాలని, వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమె ఆసరా పెన్షన్ , రేషన్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. సెప్టెంబర్ లో మొదటి డోస్ వేసుకున్న వారు 84 రోజుల తరవాత (డిసెంబర్)లో  రెండవ డోస్ వేయడానికి ఏర్పాట్లు చేయాలనీ, రెండవ డోస్ పై దృష్టి పెట్టాలని అన్నారు. గట్టు మండలం లో వాక్సినేషన్ శాతం తక్కువ ఉన్నందున , వంద శాతం అయ్యేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. వ్యాక్సిన్ వేసుకోకపోతే పెన్షన్, రేషన్ ఇవ్వరు అనే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని , ఎలక్టోరల్ ప్రకారము వ్యాక్సిన్ వేసుకొని వారు ఎంత మంది ఉన్నారు గుర్తించి లిస్టు తయారు చేసి , రేషన్ డీలర్లకు వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితా ఇచ్చి , డీలర్లు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమె రేషన్ ఇస్తామని చెప్పాలని అన్నారు. సబ్ సెంటర్ ల వారిగా మిగిలిపోయిన వారి లిస్టు తయారు చేసి, తక్కువ వాక్సినేషన్ అయిన సెంటర్ లను వైద్య సిబ్బంది విజిట్ చేయాలని  వైద్యాధికారికి ఆదేశించారు. గ్రామాలలో కొత్తగా వలసదారులు ఉంటే వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయించాలని స్పెషల్ అధికారులకు ఆదేశించారు. వ్యాక్సిన్ వేసుకొని వారికి ఆసరా పెన్షన్లు ఆపేయాలని డి.ఆర్.డి.ఎ అధికారికి ఆదేశించారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, వైద్య అధికారి చందు నాయక్,డి.ఆర్.డి.ఎ ఉమాదేవి, మండల స్పెషల్ అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారి చేయబడినది.

 

Share This Post