జిల్లా లో ఖరీఫ్ పంట కొనుగోలు విషయంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                                తేది 16-11-2021

జిల్లా లో ఖరీఫ్ పంట  కొనుగోలు విషయంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయడం జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా  ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  తెలిపారు.

మంగళవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  మార్కెటింగ్, డియం మార్క్ ఫెడ్ , కోపరేటివ్ , డి ఆర్ డి ఏ   జిల్లా పౌర సరపరాల శాఖల ఆధ్వర్యంలో వరి కొనుగోలు పై  సమావేశం  నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 69  వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని, వరి కొనుగోలు విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని, మధ్యవర్తుల ప్రమేయం లేకుండగా ధాన్యాన్ని రైతులే స్వయంగా సెంటర్లకు తీసుకువచ్చేలా చూడాలని  అన్నారు.   ఈ సంవత్సరం  వరి ధాన్యం 1.90,581 మెట్రిక్ టన్నుల పంటను కొంటామని,.  ప్రతి కొనుగోలు కేంద్రంలో తప్పనిసరిగా కనీస సౌకర్యాలు త్రాగునీరు, విద్యుత్ కనెక్షన్ , మరుగుదొడ్లు , షామియానా  వంటివి ఉండేవిధంగా చూసుకోవాలనిఅధికారులకు  ఆదేశించారు. వరి కొనుగోలు విషయంలో ఒక పద్దతిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.  వరి కి మద్దతు ధర గ్రేడ్-ఏ రకం అయితే క్వింటాలుకు రూ. 1960 సాధారణ రకం అయితే రూ. 1940 చెల్లించడం జరుగుతుందన్నారు.   ఏ ఇ ఓ లు సర్టిఫై చేస్తేనే వరి కొనుగోలు చేయాలనీ,  ఆన్లైన్ ప్రక్రియలో రైతుల వివరాలు  తప్పులు లేకుండా నమోదు  చేయాలని , సమయానికి టోకెన్లు అందేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.  ప్రతి సెంటర్లో వేయింగ్ మిషన్లు , ధాన్యం లో తడిని చెక్ చేసే మిషన్లు,  శుబ్రపరిచే మిషన్లు పనిచేసేటట్లు చూడాలన్నారు.  నాణ్యత కలిగిన  గన్ని బ్యాగులను సెంటర్లకు పంపిణి చేయాలనీ, ప్రతి రోజు రిపోర్ట్ సబ్మిట్ చేయాలనీ  అధికారులకు ఆదేశించారు.  పోలీస్, రెవెన్యు, వ్యవసాయ అధికారుల అద్వర్యం లో చెక్ పోస్ట్ ల వద్ద పర్యవేక్షణ ఉండాలన్నారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ , డి ఎస్ పి రంగ స్వామి, ఆర్ డి ఓ  రాములు, డి ఎస్ ఓ రేవతి , డి ఏ ఓ గోవిందు నాయక్, డి ఎం ప్రసాద రావు, ఆర్ టి ఏ చక్రవర్తి , మార్కెటింగ్ పుష్ప, రైస్ మిల్లర్లు, సంబదిత అధికారులు  పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయడమైనది.

 

Share This Post