జిల్లా లో గణతంత్ర్య దినోత్సవ వేడుకలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జరుపుకోవాలని అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అధికారులను ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                తేది: 24-01-2022

జిల్లా లో గణతంత్ర్య దినోత్సవ వేడుకలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ  జరుపుకోవాలని  అదనపు  కలెక్టర్ రఘురాం శర్మ   అధికారులను ఆదేశించారు.

సోమవారం  కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో గణతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ కరోనా మూడో దశ ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు  ఈనెల 26న గణతంత్ర్య దినోత్సవ వేడుకలు కోవిడ్ నిబంధనల ప్రకారము  నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 73 వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు కల్లెక్టరేట్ కార్యాలయ ఆవరణ లో   పతాకావిష్కరణ గావించేందుకు  సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు  చేయాలని అన్నారు.  ప్రోటో కాల్ ప్రకారం  ముఖ్య అతిథులకు బౌతిక దూరం పాటిస్తూ సీట్ అరేంజ్మెంట్స్ ,త్రాగునీరు,  తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ అధికారులకు ఆదేశించారు.  . ప్రతి ఒక్కరు మాస్కు దరించి బౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేయాలనీ, మాస్క్ లు, సానిటైజర్ లను అందరికి అందుబాటులో ఉండే విధంగా చూడాలని జిల్లా వైధ్యదికారులకు ఆదేశించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం గణతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాములు,  డి ఆర్ డి ఓ ఉమా దేవి,, సి పి ఓ లక్ష్మణ్ , డి ఎస్ పి ఇమ్మానేల్   ,  డి ఎస్ ఓ రేవతి, మదుసూదన్, ఎల్లయ్య,కిరణ్ కుమార్, డిపి ఆర్ ఓ చెన్నమ్మ, తదితరులు పాల్గొన్నారు..

———————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా  జారీ చేయడమైనది.

Share This Post