జిల్లా లో చైల్డ్ లేబర్, బాల్య వివాహాలను అరికట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు.

పత్రిక ప్రకటన                                                                    తేది:1-10-2021

జిల్లా లో చైల్డ్ లేబర్, బాల్య వివాహాలను అరికట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు మహిళా , శిశు, సంక్షేమ శాఖ  ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలో  బాలల సంరక్షణ సొసైటీ వారు ఇచ్చిన ఎజెండా ను సర్కులేట్ చేసుకొని , ఎక్కడ కూడా బాల్యవివాహాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. బాల్య వివాహాలను ఆపడానికి పోలీస్ మరియు రెవిన్యూ సహాయం తీసుకోవాలని అన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ లలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ లైన్ , సఖి ఫోన్ నెంబర్లను డిస్ప్లే చేసి, బాలల హక్కుల పై, చట్టాల పై అవగాహన కల్పించాలని అన్నారు. గుర్తింపు లేని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లను గుర్తించి వారి పై కేసు నమోదు చేయాలనీ అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సహకారం తో ప్రతి పాటాశాలకు షెడ్యూల్ ఇచ్చి బాలల ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలనీ అన్నారు. అనాధ బాలలను గుర్తించి బాలికలను కస్తుర్బా పాటశాలల్లో , బాలలను రెసిడెన్షియల్ పాటశాలలో చేర్పించుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని పాటశాలల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని విద్యా శాఖ అధికారులకు ఆదేశించారు.  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతి 3 నెలలకు ఒకసారి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లను విజిట్ చేసి, సానిటేషన్, హైజీన్ చెక్ చేసి, బాలల సంరక్షణ గురించి వివరాలను తెలుసుకోవాలని అన్నారు. చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఆర్.బి.ఎస్.కె టీం ద్వారా షెడ్యూల్ తయారు చేసుకొని   స్కూల్స్ లో పిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించాలని వైద్య అధికారులకు ఆదేశించారు.  పిల్లలను దత్తత తీసుకునే వారికి ప్రభుత్వ నిబంధనలను మరియు చట్టాల పై అవగాహన కల్పించాలని, చట్ట విరుద్ధంగా పిల్లలను పెంచుకున్న, దత్తత తీసుకున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా లోపం ఉన్న  పిల్లలను గుర్తించి వారికి  పౌష్టికాహారం అందించాలని అన్నారు. అనాధ బాలలకు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ లను జారి చేయాలనీ రెవిన్యూ అధికారులకు ఆదేశించారు. చైల్డ్ లైన్ , సఖి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ టోల్ ఫ్రీ నెంబర్ లు 24 గంటలు అందుబాటులో ఉండాలని, సిబ్బంది ఫోన్ లకు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టాలని అన్నారు. పోక్సో కేసులు ఎన్ని ఉన్నాయని, తప్పి పోయిన పిల్లల్లో ఎంత మంది ట్రేస్ అవుట్ అయ్యారని, అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధులు ,  అధికారులు అందరు చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సమన్వయంతో సమస్యలను పరిష్కరించడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

తదనంతరం మహిళా , శిశు , దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ బాల రక్షా భవన్ , బాలల పరిరక్షణ విభాగం పోస్టర్ ను విడుదల చేశారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, డి.ఎస్పి.రంగ స్వామి, ఆర్.డి.ఓ రాములు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ముశాయిధ బేగం, డి.ఈ.ఓ. సిరాజ్జుద్ధిన్,లేబర్ బాల రక్షా భవన్ కో-ఆర్డినేటర్ హేమలత, నరసింహ, సి.డి.పి.ఓ లు, సుపర్వైజర్లు , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post