జిల్లా లో జనవరి 1, 2022 నాటికీ 18 సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి యువత తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

పత్రికా ప్రకటన                                                        తేది 26-11-2021

జిల్లా లో జనవరి  1, 2022 నాటికీ 18 సంవత్సరాలు పూర్తి అయిన  ప్రతి యువత తమ  ఓటు హక్కు నమోదు చేసుకోవాలని  జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు.

శుక్రవారం స్పెషల్ సమ్మరీ రోల్స్ రివిజన్ (SSR)-2022 లో భాగంగా జిల్లా లోని ప్రియదర్శిని మహిళా డిగ్రీ మరియు పి జి కళాశాల లో నిర్వహించిన ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఓటు హక్కు నమోదు పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్  మాట్లాడుతూ భారత దేశం లో మొట్ట మొదటి సారిగా రాజ్యాంగం లో ఆర్టికల్ 324 కింద ఎన్నికల కమిషన్ అఫ్ ఇండియా ఏర్పడిందని, ఈ కమిషన్ ఎన్నికలను నిష్పక్షపాతంగా  నిర్వహిస్తుందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువత అందరు ఓటు హక్కు నమోదు చేసుకొని , ఓటర్ జాబితా లో పేర్లు ఉండేలా చూసుకోవాలని  అన్నారు. దేశం లో మంచి పౌరులు ఎవరంటే ఓటు హక్కును వినియోగించుకుని , ఓటు వేసేవారని, రాజ్యాంగం యొక్క విధానాలను అర్థం చేసుకోవాలని , విద్యార్థులకు తెలిపారు. ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ గా కొనసాగించాలని, ఆన్లైన్ లో ఫార్మ్ 6 లో ఓటు నమోదు చేసుకోవచ్చని, వలస వచ్చిన వారు, కొత్త వారు ఎవరయినా ఉంటే ఫార్మ్ 6,7,8 A లలో నమోదు చేసుకోవచ్చని, తెలిపారు. ఓటు హక్కు నమోదు చేసుకున్న వారె ఓటర్ గా పరిగణింపబడతారని అన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ సంపత్ కుమార్ మాట్లాడుతూ భారత దేశ ప్రజాస్వామ్యం లో అత్యధిక సంఖ్య యువత ఉందని, ఓటు ప్రాధాన్యత గురించి తెలుసుకొని, యువత తమ ఓటు హక్కును చైతన్య వంతంగా వినియోగించుకోవాలని అన్నారు. రెండు అక్షరాల ఓటు ప్రపంచ స్థితి గతులనే మార్చగలదని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు ను బాధ్యత గా నిర్వహించాలని అన్నారు. కులమతాలకు అతీతంగా అభ్యర్థిని బట్టి  ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయుటకు యువత కృషి చేయాలని అన్నారు.

కార్యక్రమం లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి  ముశాయిధ బేగం, స్వీప్ నోడల్ అధికారి గోవింద్ నాయక్, డిప్యూటీ తహసిల్దార్  సత్యనారాయణ రెడ్డి, మదన్ మోహన్ , కళాశాల  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

 

Share This Post