జిల్లా లో జరిగే ఉపాధి హామీ పనులు త్వరితగతిన పూర్తి చేయలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్ని మండలాల ఎంపిడిఓ లకు ఆదేశించారు.

   పత్రికా ప్రకటన                                                                తేది : 19-08-2021

          జిల్లా లో జరిగే ఉపాధి హామీ పనులు త్వరితగతిన పూర్తి చేయలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్ని మండలాల ఎంపిడిఓ లకు ఆదేశించారు.

        గురువారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు మండల స్పెషల్ అధికారులు, ఎంపిడిఓ ల తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ NREGS పనులను వేగవంతం చేసి ఈ మూడు రోజులలో పూర్తి అయ్యేలా చూడాలని , ఎక్కడ కుడా పెండింగ్ పనులు ఉండకుండా డే అండ్ నైట్ పని చేసి పనులు పూర్తి చేసి రెడీ గా ఉంచాలని అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ పనులలో జిల్లా టాప్ లో ఉందని , రైతు వేదికలు , సేగ్రిగేషణ్ షెడ్లు, పల్లె ప్రకృతి వనం, వైకుంటదామల నిర్మాణ  పనులను పూర్తి అయ్యేలా చూడాలని, ప్రతి మండలంలో  గ్రామాలను గుర్తించి అన్ని పనులు పూర్తి అయ్యాయ లేదో చూసుకోవాలని స్పెషల్ అధికారులకు ఆదేశించారు. రైతు వేదికల దగ్గర సి.సి. రోడ్లు వేయించి, నేమ్ బోర్డు లు ఏర్పాటు చేయాలనీ అన్నారు. మొదలు పెట్టిన మరియు పూర్తి అయిన పనుల ఫోటోలు, వర్క్ ఫైల్ ను తయారు చేయాలనీ ,గ్రామాలలో జాబ్ కార్డు జారి చేసిన రిజిస్టర్, గ్రామ సభ రిజిస్టర్ తప్పని సరిగా ఉండాలని అన్నారు.  NREGS  కి సంబంధించిన ప్రతి పని శ్రద్ధగా చేయాలనీ అన్నారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రతి ఒక్కరితో జాబ్ కార్డు ఉండేలా చూడాలని అన్నారు.

గ్రామ స్థాయి లో జాబ్ కార్డ్స్ జా  రి చేసే అధికారి సంతకం తపక  ఉండాలని,ఎంపిడిఓలు, ఎంపి ఓలు, సర్పంచ్ లతో మాట్లాడి NREGS పనులు  పూర్తి చేయాలనీ  అధికారులకు ఆదేశించారు. ప్లాంటేషన్ వంద శాతం పూర్తి అయ్యేలా చూడాలని, అందరు కలిసి పనిచేసి రాష్ట్ర స్తాయి లో జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని అన్నారు.

        సమావేశంలో  అదనపు కలెక్టర్ శ్రీహర్ష, డి ఆర్ డి ఓ ఉమా దేవి, జాడ్పి సి ఇ ఓ విజయనాయాక్ , జిల్లా స్పెషల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post