జిల్లా లో జరుగతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                తేది 29-10- 2021

జిల్లా  లో జరుగతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు   త్వరగా పూర్తి  చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  సంబంధిత అధికారులకు  ఆదేశించారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు పంచాయత్ రాజ్, నీటి పారుదల శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణాలు ఎన్ని  పూర్తి అయ్యాయని అడిగి తెలుసుకున్నారు. గద్వాల్ నియోజిక వర్గానికి 1300 ఇళ్ళు , ఆలంపూర్ నియోజిక వర్గానికి 1170 ఇళ్ళు మంజూరు అయ్యాయని, గద్వాల్ లో 1300 ఇళ్లకు గాను 585 ఇళ్ళ నిర్మాణం పూర్తి అయిందని , మిగితా 715 ఇళ్ళ నిర్మాణ పనులు కుడా త్వరగా పూర్తి చేయాలనీ అన్నారు. అలంపూర్ నియోజిక వర్గం లో 1170 ఇళ్లకు గాను 580 ఇళ్లకు టెండర్ పూర్తి అయిందని, మిగత వాటికి స్థలాన్ని గుర్తించుటకు  ఎం.ఆర్.ఓ లకు  ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. రెండు పడక గదుల ఇండ్లకు తప్పనిసరిగా రోడ్లు, విద్యుత్తు, త్రాగునీరు సౌకర్యాలు ఉండాలన్నారు. నిర్మాణం పూర్తి అయిన ఇళ్లకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, నిర్మాణం లో నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు.  కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ ప్రకారము నిర్దేశించిన సమయానికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు. అధికారులు బాధ్యతతో పని చేసి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించాలన్నారు.

సమావేశం లో అదనపు కలెక్టర్లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, పంచాయత్ రాజ్ ఇ.ఇ. సమత, ఇరిగేషన్ ఎస్.ఇ.శ్రీనివాస్ రావు, ఎ.ఓ. మదన్ మోహన్, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి  జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

 

Share This Post