జిల్లా లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శృతి ఓజా.

పత్రికా ప్రకటన                                                                   తేది : 21-08-2021

జిల్లా లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శృతి ఓజా.

శనివారం జిల్లాలోని గద్వాల్ మండలం కొండపల్లి, గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి,  గ్రామాలలో  NREGS, ఉపాధి హామీ  పనులను పరిశీలించారు. కొండపల్లి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంటదామం, సేగ్రిగేషణ్ షెడ్లను  పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం లో పని చేసే వాచర్ తో మాట్లాడి , ప్రకృతి వనంలోని మొక్కలకు నీళ్లు రోజు పట్టాలని, ఎక్కడ కూడా ఖాళీ స్థలం ఉండకుండా మొక్కలు నాటాలని అన్నారు. మీకు జాబ్ కార్డు ఉందా, డబ్బులు మీ అకౌంట్ లో వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఎన్ని జాబ్ కార్డ్స్ జారి చేసారని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రతి ఒక్కరితో జాబ్ కార్డు ఉండేలా చూడాలని అన్నారు. గ్రామ పంచాయత్ కార్యాలయం లో రిజిస్టర్లను పరిశీలించారు. గ్రామ పంచాయత్ లో ఉండాల్సిన  7 రిజిస్టర్ లను కచ్చితంగా మేంటైన్  చేయాలనీ అన్నారు. పంచాయత్ సెక్రటరీ లు ఎప్పటికప్పుడు రిజిస్టర్ లను అప్డేట్ చేయాలనీ అన్నారు. అధికారులు తనిఖీ చేసే సమయం లో గ్రామ పంచాయత్ కార్యాలయం లో అన్ని రిజిస్టర్ లు అందుబాటులో ఉండాలని పంచాయత్ సెక్రటరీలకు ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ప్రతి పనికి కుడా వర్క్ ఫైల్ ఉండాలని అన్నారు. వర్క్ ఫైల్ లో పనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్, ఫోటోలు ఉంచాలని తెలిపారు.  క్యాష్ బుక్, జాబ్ కార్డు జారి చేసిన రిజిస్టర్, గ్రామ సభ రిజిస్టర్లను అప్డేట్ చేయాలనీ అన్నారు. సర్పంచులు ముందు ఉండి గ్రామ సభ నిర్వహించాలని అన్నారు. జరుగుతున్న పనుల ఫోటో లు తీసి వర్క్ ఫైల్ తయారు చేయాలనీ  పంచాయత్ అధికారులకు ఆదేశించారు.

        ఎన్.వి.ఎస్.ఎస్.ప్రసాద్ IFS స్పెషల్ కమీషనర్ కలెక్టర్ గారితో కలిసి  గట్టు మండలం గోర్లఖాన్ దొడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయం లో ఉన్న అన్ని రిజిస్టర్ లను పరిశీలించి ,  క్యాష్ బుక్, జాబ్ కార్డు జారి చేసిన రిజిస్టర్, గ్రామ సభ రిజిస్టర్లను మరియు వర్క్ ఫైల్స్, వర్క్ బోర్డ్స్ అప్డేట్ చేయాలనీ పంచాయతి సెక్రటరీలకు ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో డి.ఆర్.డి.ఓ ఉమాదేవి, స్పెషల్ అధికారులు వెంకటేశ్వరులు, పంచాయత్ సెక్రటరీలు లక్ష్మణ్, నర్సింహులు, ఎంపిడిఓ సూరి, సర్పంచులు శంకరమ్మ, మహేశ్వరమ్మ, ఎంపిటిసిలు, ఎ.పి.ఎం శివ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–      

     జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post