జిల్లా లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చే రైతులు వరి లో తేమ లేకుండా ఆరబెట్టి, ధాన్యం లో మట్టి పెల్లల్లు, రాళ్ళు, తాలు, లేకుండా కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ అన్నారు.

బుధవారం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యం లో జిల్లా మార్కెట్ యార్డ్ నందు ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ వరి కి మద్దతు ధర గ్రేడ్-ఏ రకం అయితే క్వింటాలుకు రూ. 1960 సాధారణ రకం అయితే రూ. 1940 చెల్లించడం జరుగుతుందని, రైతులు ధాన్యం లో తేమ శాతం 14% నుండి 17% లోపు ఉండే విధంగా ధాన్యాన్ని ఆరబెట్టి, శుబ్రం చేసి, ఎ.ఈ.ఓ లు ఇచ్చిన టోకెన్ లలో ఉన్న తేదీల ప్రకారము కేంద్రానికి వరిని తీసుకురావాలని కోరారు.  రైతులు వారి ఆదార్ కార్డు , పట్టాదార్ పాస్ బుక్, బ్యాంకు పాస్ బుక్ ల యొక్క జిరాక్స్ కాపీ లను కొనుగోలు కేంద్రాలలో సమర్పించాలని అన్నారు.

కార్యక్రమం లో జిల్లా మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, జిల్లా సివిల్ సప్లై అధికారి రేవతి, డి.ఎం ప్రసాద రావు, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయడమైనది.

Share This Post