జిల్లా లో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల పై ప్రధానోపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రత్యెక తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.

పత్రికా ప్రకటన                                                తేది : 21-4-20 22

జిల్లా లో పదవ తరగతి పరీక్షలు   రాసే విద్యార్థుల పై ప్రధానోపాద్యాయులు  ప్రత్యేక శ్రద్ధ వహించి,   ప్రత్యెక తరగతులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.

గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు విద్యా శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో ప్రతీ విద్యార్ధి చక్కగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించేలా వారిలో విషయ పరిజ్ఞానం పెంపొందింపజేయాలని అన్నారు. ఈ నెల  25  నుండి  పదవ తరగతి పరీక్షలు మొదలయ్యే ముందు రోజు వరకు ఉపాద్యాయులు పదవ తరగతి చదివే  విద్యార్థిని , విద్యార్తులకు  ప్రత్యెక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఉపాద్యాయులు, ప్రధానోపాద్యాయులు ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక తరగతులు నిర్వహించే సమయం లో విద్యార్థులకు స్నాక్స్, త్రాగు నీరు, అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనీ విద్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఉపాధ్యాయులు  ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్ సబ్జెక్టు ల పై ప్రత్యేక దృష్టి సారించి , విద్యార్థులకు ఈ సబ్జెక్టు ల పై అవగాహన కల్పించి , పదవ తరగతి పరిక్షలలో జిల్లాలో వంద శాతం ఉతీర్ణత సాధించేలా కృషి చేయాలనీ  తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే ఎక్కువ శాతం చదువుతున్నందున, వారికి చక్కటి భవిష్యత్తును అందించాలనే ఆశయంతో ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా  చక్కటి ప్రణాళికతో విద్యాబోధన జరిపిస్తూ మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో పదవ తరగతి పరిక్షలు రాసే బాలురు 2415, బాలికలు 2773 మొత్తం 5188 విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం లో భాగంగా జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సమావేశం లో డి.ఇ.ఓ సిరాజుద్ధిన్, ఎ.డి ఇందిరా, ఎన్.ప్రతాప్ రెడ్డి, నరేష్, సెక్టరియల్ అధికారులు, మండల విద్యాధికారులు, ఐ.ఇ.సి కో ఆర్డినేటర్స్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

Share This Post