జిల్లా లో పెండింగ్ లో ఉన్న ధరణి భూ సమస్యలను స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తాసిల్దార్ లకు ఆదేశించారు.

పత్రిక ప్రకటన                                                                    తేది 07.10.2021

 

జిల్లా లో పెండింగ్ లో ఉన్న ధరణి భూ సమస్యలను స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తాసిల్దార్ లకు ఆదేశించారు.

గురువారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు అన్ని మండలాల తహసిల్దార్ల తో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి వెబ్ సైట్ ద్వారా భూముల సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లాగిన్ లో స్ప్రెడ్ షీట్ ఎప్పటికప్పుడు చెక్ చేసి , అన్ని కాలమ్స్ ను పూర్తి చేసి తేది తో పాటు తప్పనిసరిగా రిమార్క్ రాసి  రిపోర్ట్ పంపించాలని అన్నారు. మండలాల వారిగా  పెండింగ్ ఉన్న భూ సమస్యల పై రివ్యూ చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్లు, డి ఎస్ పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకు మండల కేంద్రంలోని భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

సమావేశం లో ఎ.ఓ శ్యాం, తహసిల్దార్ రాజు, రమేష్, లక్ష్మి, భద్రప్ప, అన్ని మండలాల తహసిల్దార్లు , సంబదిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చే జారి చేయబడినది.

 

 

Share This Post