జిల్లా లో ప్రతి ఒక్కరి లో జాతీయభావం పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ను ఇంటింటా పండుగ వాతావరణం లో జరుపుకోవాలని, 75 వ భారత స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమము లో బాగంగా ఇంటింటికి జాతీయ జెండా ల పంపిణీ కార్యక్రమాన్ని కల్లెక్టరేట్ కార్యాలయంలో జడ్ పి చైర్మెన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష , శాశనసభ్యులుకృష్ణ మోహన్ రెడ్డి గార్ల తో కలిసి ప్రారంభించారు.

మంగళవారమ కల్లెక్టరేట్ కార్యాలయంలో భారత స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమానికి సంబంధించి జాతీయ జెండాలు మరియు  ఫ్లెక్సిలు  ప్రారంభించి జిల్లలో ప్రతి ఇంటికి జాతీయ జెండాలు  చేరేలా చూడాలని సంబందిత అధికారులకు ఆదేశించారు.  జిల్లా వ్యాప్తంగా   ప్రతి ఇంటి పై జాతీయ జెండాను  ఏర్పాటు చేసుకోవాలని, గ్రామ స్తాయి లో పంచాయతి సెక్రటరీ,  మున్సిపాలిటి పరిది లో వార్డ్ అధికారులచే పంపిణి చేస్తునట్లు,  జెండా పంపిణి సమయం లో నిబంధనలు పాటించాలని అధికారులకు ఆదేశించారు.

అనంతరం జిల్లా లో 31 వ వార్డ్ నల్ల కుంట లో ఇంటింటికి వెళ్లి జెండాలను పంపిణి చేశారు.  జిల్లా లో శ్రీనివాస్ థియేటర్ కు వెళ్లి అక్కడ పిల్లలు ఎంత మంది వచ్చారు, సినిమా అయిన తర్వాత వారికీ పండ్లు పంపిణి చేసి సురక్షితంగా వాహనాలలో తీసుకెళ్ళి వారి ఇండ్లకు చేర్చాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ,జడ్ పి వైస్  చైర్మెన్ సరోజమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి రామేశ్వరమ్మ ,కే టి దొడ్డి జడ్పిటిసి రాజశేఖర్ , జాడ్ పి సి ఇ ఓ విజయ నాయక్, డి ఆర్ డి ఓ నాగేంద్రం, డి పి ఓ శ్యాం సుందర్, ఆర్ టి ఏ పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————————–

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post