జిల్లా లో ప్రతి మండలం లో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం లు, పల్లె ప్రకృతి వనం ల ఏర్పాటు కు సంబంధించి సకాలం లో చెల్లింపులు చేయాలని మండల అధికారులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు

బుధవారం  జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి  సహాయక పథక సంచాలకులు,  మండల పరిషత్ అభివృద్ధి అధికారులు,  మండల పంచాయత్ అధికారులు, అదనపు ప్రోగ్రాం అధికారులు,  పంచాయితీ కార్యదర్శులతో వీడియో కాన్ఫెరెన్స్  నిర్వహించి బృహత్ పల్లె ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు,  క్రిమిటోరియా, సెగ్రి గేషన్ షేడ్స్ , యం.జి.యన్.ఆర్.ఇ.జి.యస్. పనుల పురోగతిపై మండలం ల వారిగా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించినారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మండలాలలోని బృహత్ పల్లెప్రకృతి వనాలకు సంబంధించి అక్టోబర్ 6 వ తేదీ లోగా 75% చెల్లింపులు పూర్తిచేయాలని ఎం.పి.డి.ఓ.లను    ఆదేశించారు. అదే విధంగా అన్ని మండలాలలోని అన్ని పల్లెప్రకృతి వనాలకు సంబంధించి 75% చెల్లింపులు కూడా అక్టోబర్ 6 వ తేదీ లోగా పూర్తిచేయాలని ఆయన  కోరారు. అందరు పంచాయితీ కార్యదర్శులు అక్టోబర్ 6 లోగా ఇంటింటి సర్వే నిర్వహించి వారికి అవసరమైన మొక్కలు రిజిష్టర్లో నమోదు చేయాలని  జిల్లా కలెక్టర్  మండల పంచాయతి అధికారులు,పంచాయతి కార్యదర్శు లను ఆదేశించారు. నర్సరీలలో ఉన్న మొక్కలను సేగ్రిగేట్ చేసి పెద్ద మొక్కలను కన్వర్షన్ పూర్తీ చేయాలని ఎం.పి.డి.ఓ.,ఎం.పి.ఓ.,ఏ.పి.ఓ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
నర్సరీలకు అవసరమైన వనసేవక్ ను గుర్తించాలని ఆయన అన్నారు. నర్సరీలలో గత సంవత్సరం ఎన్ని టేకు మొక్కలు పెంచారో ఈ సంవత్సరం కూడా అన్నే టేకు మొక్కలు పెంచాలని  ఆదేశించారు. ప్రతి నర్సరీలో ఈ సంవత్సరం 15000 మొక్కలు పెంచుటకు చర్యలు తీసుకోవాలని   ఆయన ఆదేశించారు .
అన్ని నర్సరీలకు అక్టోబర్ 5 లోగా  మట్టి సేకరించటం, భూమి చదును చేయటం పూర్తీ చేయాలని అన్నారు.  నర్సరీలకు సీడ్ కలెక్షన్, పాలిథీన్ సంచులు నింపుట అక్టోబర్ 10 లోగా పూర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
 నర్సరీలలో ప్రైమరీ బెడ్లు సిద్ధం చేసుకోవాలని వాటిల్లో అవసరమైన కటింగ్స్ నాటాలని అన్నారు. జిల్లాలో పురోగతిలో ఉన్న అన్ని సేగ్రిగేషన్ షెడ్లు అక్టోబర్ 5 లోగా పూర్తిచేయాలని కోరారు. జిల్లాలో పురోగతి లో ఉన్న
 యం.సి.సి. క్రిమిటోరియాలు అక్టోబర్ 10 లోగా  పూర్తిచేయాలని ఆదేశించారు. జలశక్తి అభియాన్ పథకంలో భాగంగా పూర్తయిన పనులన్నింటిని వెబ్ సైట్లో   అప్లోడ్ చేసే విదంగా తగిన చర్యలు గైకోనాలని అన్నారు.
సస్పెండేడ్, రిజేక్టేడ్ పేమెంట్స్ వెంట వెంటనే పూర్తి చేయుటకు తగిన చర్యలు గైకోనాలని కలెక్టర్ తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,డి. ఆర్.డి.ఓ.కాళిందిని,జడ్.పి.సి.ఈ. ఓ.వీర బ్రహ్మ చారి, డి.పి.ఓ.విష్ణు వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post