జిల్లా లో బాల్య వివాహాలను అరికట్టడానికి, విద్యాభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా సహాయా సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శాంతా సిన్హా ను కోరారు.

పత్రికా ప్రకటన                                                         తేది: 22-10-2021

జిల్లా లో బాల్య వివాహాలను అరికట్టడానికి, విద్యాభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా సహాయా సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి శాంతా సిన్హా ను కోరారు.

శుక్రవారం కల్లెక్టరేట్ సమవేశం హాలు నందు మాజీ జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ప్రొఫెసర్ రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా కలెక్టర్ ను కలిసి బాల్య వివాహాలు, బాలికల విద్య, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ల  పై చర్చించారు. శాంతాసిన్హా గారు మాట్లాడుతూ కరోనా తర్వాత పిల్లలందరూ పాటశాలలకు వస్తున్నారని, కరోనా సమయం లో ఇంట్లో ఉండి సమయం వృథా అయినందున, వారి జ్ఞానాన్ని పెంచుకోవడం కోసం పిల్లలందరికీ  పాఠశాలలో ఒక ప్రత్యేకమైన బ్రిడ్జి కోర్స్ భూమిక కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం అని అన్నారు. రాష్ట్రం లో ఏ జిల్లాలో చేపట్టనటువంటి  కార్యక్రమాన్ని, గద్వాల్ జిల్లాలో చేయటం జరిగిందని అన్నారు. జిల్లాలోని  పిల్లలందరూ నిరంతరాయంగా విద్యను కొనసాగించాలని,  బాలికలు విద్య పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా వరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ సమన్వయము తో బాల కార్మిక, బాల్య వివాహాల నిర్మూలన పై  ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలో  అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో బాలికలను పనులకు పంపకుండా చదివించేలా, బాల్య వివాహాలు చేసి బాలికల భవిష్యత్తు నాశనం చేయకుండా వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. బాలల హక్కులు, చట్టాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. బాలల హక్కులు కాపాడాల్సిన  బాధ్యత మనందరిది అని అన్నారు.

సమావేశం లో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, ఎం.వి. పౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి , ఎం.వి. ఫౌండేషన్ గద్వాల కోఆర్డినేటర్ సాయికుమార్, వడ్డేపల్లి, రాజోలి కో-ఆర్డినేటర్ అన్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే  జారీ చేయడమైనది.

 

Share This Post