పత్రికా ప్రకటన తేదీ: 15-09-2021
జిల్లా లో మండలం వారిగా ప్రతి ఒక్క హ్యబిటేషన్ లో 18 సం .లు పూర్తి అయిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అయ్యేలా మైక్రో ప్లాన్ తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
బుదవారం మండల పరిషత్ సమావేశం హాలు నందు ఎం పి డి ఓ లు, ఎం పి ఓ లు, మండల స్పెషల్ అధికారులు, మెడికల్ అడికరులతో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ ప్రతి మండలం లో ఉన్న ప్రతి గ్రామం వ్యాక్సినేషన్ 100 శాతం అయ్యేటట్లు ప్లాన్ చేయాలనీ, రేపటి నుండే మొదలు పెట్టాలని అన్నారు, అందరి అధికారుల సమన్వయం తో ఈ కార్యక్రమం జరిగేటట్లు చూడాలని, వ్యాక్సిన్ అందుబాటులో ఉంది జనాభాను దృష్టిలో పెట్టుకొని , లొకేషన్ చూసుకొని వ్యాక్సిన్ జరగాలి. మోబిలైజేషన్ మీద దృష్టి పెట్టాలి. కమ్యూనిటి హాలు, స్కూల్స్ ఉంటే అకడ ప్లాన్ చేసుకోవాలి, వ్యాక్సిన్ వేయుటకు రెండు రూములు, ఒకటి వ్యాక్సిన్ వేయుటకు, ఒకటి అబ్సేర్వేషన్ లో ఉంచేందుకు , వచ్చిన వారికీ భోజన వసతి ,మరుగుదొడ్లు ఉండేలా ఏర్పాటు చేయాలన్నారు. అందరు కోవిడ్ తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోవచ్చు అని ఆశ, అంగన్వాడి, ఏ ఎన్ ఎం లు వారిని కన్విన్సు చేయాలన్నారు. మున్సిపల్ పరిదిలో ఉన్న ప్రతి వా ర్డు లో ఉన్న ప్రతి ఇంటిని చెక్ చేసి వ్యాక్సిన్ వేసుకున్న వారు ఎంత మంది, వేసుకొని వారు యెంత మంది అని లిస్టు తయారు చేసుకొని , ఆ ఇంటిలో అందరు వ్యాక్సిన్ వేసుకునట్లు తెలిస్తే ఆ ఇంటికి స్టిక్కర్ వేయాలని, వ్యాక్సిన్ తీసుకోవడం ప్రతి ఒక్కరి బాద్యత అని వారికీ గుర్తు చేయాలని , ఒక పండుగ వాతావరంలో ఈ స్పెషల్ కార్యక్రమాన్ని చేయాలనీ ఆదేశించారు. మండలం వారిగా ప్లాన్ ఎలా చేస్తారు అని స్పెషల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లా లో 91 హ్యబి టే షన్లు ఉన్నాయని , ప్రతి వార్డులో ఆటో లో రికార్డు చేసి చెప్పాలని, అందరిని మోబిలైజ్ చేసి వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలన్నారు. మైక్రో ప్లాన్ రేపటి నుండే మొదలు పెట్టండి, ప్రతి రోజు రిపోర్ట్ ఇవ్వాల్లన్నారు
సమావేశం లో జిల్లా వైద్య అధికారి చండునయాక్, జిల్లా స్పెషల్ అధికారులు, ఎం పి డి ఓ లు, ఎం పి ఓ లు, మెడికల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారిచే జారీ చేయబడినది.
