జిల్లా లో మున్సిపల్ పరిదిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు టెండర్లను ఫైనల్ చేయాలనీ జిల్లా కలెక్టర్ శృతి ఓజా అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                                        తేది: 31-07-20 21


 జిల్లా  లో మున్సిపల్ పరిదిలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు  టెండర్లను ఫైనల్ చేయాలనీ జిల్లా కలెక్టర్ శృతి ఓజా అధికారులకు   ఆదేశించారు.

శనివారం  కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు  రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్  కమిటి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలకు సొంత ఇల్లు కల లాంటిదని, ప్రభుత్వం నిరుపేదల కల సాకారం చేసేందుకు జిల్లాలో 715  రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను చేపట్టేందుకు కమిటి అధ్వర్యంలో టెండర్ ఫైనల్ చేశామని,  అధికారులు బాధ్యతతో పని చేసి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించాలన్నారు. ఆలంపూర్ నియోజక వర్గంలో కూడా టెండర్లను ఫైనల్ చేయాలన్నారు. నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. టెండర్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రెండు పడక గదుల ఇండ్లకు తప్పనిసరిగా రోడ్లు విద్యుత్తు త్రాగునీరు సౌకర్యాలు ఉండాలన్నారు. మౌళిక సదుపాయల కోసం ప్రపోసల్స్ పంపించాలని, ప్రతి బిల్లుకి క్వాలిటీ సర్టిఫికేట్ ఉండాలని అధికారులకు ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రఘురాం శర్మ, నీటిపారుదల అధికారులుశ్రీనివాస రావు,విజయకుమార్ రెడ్డి, పిఆర్ ఈఈ సమత, ఆడిట్ అధికారి బీమ్ల నాయక్, భాష్కర్ .తదితరులు పాల్గొన్నారు.

————————————————————-

 జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా  జారీ చేయడమైనది.

Share This Post