జిల్లా లో లే అవుట్లను క్రమబదీకరించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు..

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

పత్రికా ప్రకటన                                                                   తేది: 03-08-20 21

జిల్లా లో లే అవుట్లను  క్రమబదీకరించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు..

మంగళ వారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు గద్వాల్, ఆలంపూర్, వడ్డేపల్లి, ఐజ   మున్సిపల్ అధికారులతో  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  ఆతరైజేడ్ లే అవుట్లలో 10% భూమికి పర్మిషన్ ఇచ్చారా లేదా చూసుకొని, ఇవ్వకపోతే మూడు రోజులు టైం ఇచ్చి  భూమిని రిజిస్ట్రేషన్ చేయించాలని అధికారులకు ఆదేశించారు. ఎల్.ఆర్.ఎస్ కోసం క్లస్టర్ రెడీ చేసుకోవాలని, జిల్లా కమిటీ ని ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. విద్యుత్ పోల్స్   వేయడానికి ఆ  శాఖ  పర్మిషన్  ఇచ్చిందా  లేదా  చూసుకోవాలని, నాలపర్మిషన్  వెరిఫై చేసుకోవాలని  తెలిపారు. హరితాహారం పై మాట్లాడుతూ  ఐజ, గద్వాల్ రోడు కిరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలనీ,  మున్సిపాలిటీ పరిదిలో ఉండే ట్రీ పార్క్  ల పెండింగ్ పనులను త్వరిగతిన పూర్తి చేయాలనీ ,  కాంట్రాక్టర్లు పనులు మొదలు పెట్టెలా చూడాలని, సిసి రహదారుల పనులు, వైకుంట దామాలు ,సేగ్రి గేషన్ షెడ్డు పెండింగ్ పనులు ఆగష్టు 15 వరకు పూర్తి అయ్యేలా చూడాలని , పనుల పురోగతిని ఫోటో తీసి గ్రూప్లో పెట్టాలని అధికారులకు ఆదేశించారు. మున్సిపాల్టి వారిగా జరుగుతూన పనుల వివరాలు అడిగి తెలుసు కున్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, మున్సిపల్ కమీషనర్లు శ్రీనివాస్ రెడ్డి, వేణుగోపాల్, ఫల్లా రావు, నిత్యానంద్ తదితతులు పాల్గొన్నారు.

———————————————————————————

జిల్లా పౌర సంబందాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారి చేయబడినది.

Share This Post