జిల్లా లో వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాలుగు రోజుల వరకు ధాన్యం తీసుకు రావద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్గొండ, నవంబర్ 1. జిల్లా లో వర్షాలు కురుస్తున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నాలుగు రోజుల వరకు ధాన్యం తీసుకు రావద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రైతులకు విజ్ఞప్తి చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ,అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, జిల్లా పౌర సరపరాల అధికారి, పౌర సరపరాల సంస్థ డి.యం., మార్కెటింగ్,డి.ఆర్.డి.ఓ.,జిల్లా సహకార అధికారి,జిల్లా రవాణా అధికారులతో వానాకాలం 2021-22 ధాన్యం కొనుగోళ్ల పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ. కె.పి.,పి.ఏ.సి.ఎస్.,మార్కెట్ యార్డ్ లలో ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రం లలో ఇప్పటికే వున్న ధాన్యం రాశులు వర్షం కారణంగా తడవకుండా టార్పాలిన్ లతో  కప్పి వుంచాలని రైతులను కోరారు.ధాన్యం కొనుగోలు కేంద్రం లలో నిల్వ ఉన్న ధాన్యం రాశులను వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా తేమ శాతం పరిశీలించి రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సరైన తేమ శాతం వచ్చిన ధాన్యం ను వెంటనే తూకం వేయించి ట్యాగ్ చేసిన మిల్లులు రవాణా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోలు కేంద్రం లో ధాన్యం తెచ్చు  రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన  నాణ్యతా ప్రమాణాల తో ఉన్న ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర చెల్లించాలని అన్నారు.ధాన్యం లో తాలు లేకుండా ఉండుటకు రైతులు ధాన్యం తూర్పార పట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటినీ వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సెల్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,డి.ఆర్.డి.ఓ.కాళిందిని,జిల్లా సహకార అధికారి ప్రసాద్,జిల్లా పౌర సరఫరాల డి.యం.నాగేశ్వర్ రావు,జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, జిల్లా రవాణా అధికారి సురేష్ రెడ్డి, జిల్లా సహాయ పౌర సరఫరాల అధికారి నిత్యానందం తదితరులు పాల్గొన్నారు

Share This Post