జిల్లా లో వానాకాలం లో పండించిన పంటల వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన                                                         తేది 09 -12-2021

జిల్లా లో వానాకాలం లో పండించిన పంటల వివరాలను  ఎలాంటి పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు.

గురువారం జిల్లా కల్లెక్టర్  క్యాంపు కార్యాలయం నందు జిల్లా ముఖ్య ప్రణాళిక అధీకారి,  నీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యనవన శాఖ, మత్స్యశాఖ, భూగర్భ శాఖ అధికారులతో ఏర్పాటు సమావేశం లో మాట్లాడుతూ 2021-2022 సంవత్సరం వాన కాలం లో పండించిన పంటల వివరాల నమోదు ప్రక్రియ లో పంటల వివరాలను, నీటి పారుదల వివరాలను సరిగ్గా నమోదు చేయాలనీ అధికారులకు ఆదేశించారు. నీటి పారుదల మరియు నీటి పారుదల కాని పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రబీ సీజన్లో పండించిన పంట వివరాలు, ఆర్.డి.ఎస్ కాల్వ కింద పండించే పంట వివరాలు, జిల్లా లో వరి, మిరప, పత్తి ఇతర పంటలు మొత్తం ఎంత  పండించారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నీటి పారుదల కాని వివరాలను కరెక్ట్ గా నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

సమావేశం లో వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మన్, ఉద్యనవన శాఖ అధికారి సురేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల  గారి చే  జారీ చేయబడినది.

Share This Post