జిల్లా లో వైన్ షాప్ ల కేటాయింపు ను లాటరి పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు

పత్రికా ప్రకటన                                                             తేదీ 8.11.2021

జిల్లా లో వైన్ షాప్ ల  కేటాయింపు ను   లాటరి పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా అభ్కారీ శాఖ  అద్వర్యంలో ఏర్పాటు చేసిన లాటరి డిప్ కార్యక్రమం లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వ్యుల మేరకు వైన్ షాపుల   రిజర్వేషన్ ప్రక్రియ లాటరి పద్దతి లో జరుగుతుందని తెలిపారు.  మధ్యం షాపులు కేటాయించే సమయంలో  గౌడ కులస్థులకు 15%,  ఎస్సీలకు 10%,  ఎస్టీలకు 5%   రిజర్వేషన్ కల్పిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందున,  జిల్లాలో ఉన్న  36 వైన్ షాపులలో , రిజర్వేషన్ ప్రకారం జిల్లా బి.సి, ఎస్సి, ఎస్టి సంక్షేమ శాఖల అధ్వర్యంలో గౌడ్స్ కు 5, ఎస్సి లకు 6 షాప్ లు కేటాయించామని, ఎస్టి లలో ఎవరు లేనందున వారికి వైన్ షాప్ లు  రిజర్వ్ చేయలెదని, మిగిలిన 25  వైన్  షాపులను  ఓపెన్ కేటగిరీలో కేటాయిస్తున్నామని తెలిపారు. వైన్ షాపుల   కేటాయింపు   ప్రక్రియకు సంబంధించిన  నోటిఫికేషన్ షెడ్యుల్ ,  దరఖాస్తుల స్వికరణ మొదలైన అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా  అబ్కారీ శాఖ  అధికారి ద్వారా పొందవచ్చని తెలిపారు.

కార్యక్రమం లో జిల్లా అబ్కారి శాఖ సుపరిటేన్డేంట్ సైదులు, ఎస్ ఐ గోపాల్ , ఎస్సి వెల్ఫేర్ శ్వేత, పవన్ కుమార్ సంబదిత అధికారులు   తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

Share This Post