జిల్లా లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో విద్యార్థుల పాత్ర చాలా ఉందని, సామూహిక జాతీయ గీతాలాపన చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు

జిల్లా లో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో విద్యార్థుల పాత్ర చాలా  ఉందని,  సామూహిక జాతీయ గీతాలాపన చేసి విజయవంతం చేసినందుకు  ధన్యవాదాలు తెలిపారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా జిల్లాలో నేడు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమన్నీ అన్ని మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ గ్రామాన ఏర్పాటు చేయగా  జిల్లా కేంద్రంలో భారం బావి ప్రాంగణం లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన  దాసరి మాట్లాడుతూ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యారని,  ప్రభుత్వ, ప్రయివేటు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు దాదాపు 5500 మంది విద్యార్థులు పాల్గొని 11:30 నిమిషాలకు  అందరూ ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ స్వతంత్ర సమరాయొద్దులు ఆంగ్లేయులతో పోరాడి దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారని వారి స్ఫూర్తి తో విద్యార్థులు  మంచి పౌరులుగా దేశానికి  ఖ్యాతిని తెచ్చిపెట్టాలన్నారు. స్వతంత్ర వచ్చి 75వ సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉత్సవాలలో పాల్గొంటున్నారని విద్యార్థులకు పట్టణ ప్రజలకు మరియు ఇంతపెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పద్మజా రెడ్డి,DSP సత్యనారాయణ, జిల్లా అధికారులు వేణుగోపాల్, వీణవాని, సురేఖ, కన్యాకుమారి, జ్యోతి,మురళి, ఆర్డీఓ రామచందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ చైర్మన్ గాంధే అనసుయ్య చంద్రకాంత్, మున్సిపల్ వైస్ చైర్మన్ హరినరాయన్ భట్టాడ్, ఇండియన్ రెడ్ క్రాస్ సుదర్శన్ రెడ్డి, విద్యాసాగర్, సాయినాథ్, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్ లు మరియు ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post