జిల్లా లో 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేసే బతుకమ్మ చీరలు అందెలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

పత్రికా ప్రకటన                                                                తేది :29- 9- 2021

జిల్లా లో 18 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేసే బతుకమ్మ   చీరలు  అందెలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

బుధవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ జిల్లాకు 1,49,840 బతుకమ్మ చీరలు వచ్చాయని, జిల్లా లో మొత్తం 2,10,000 లబ్దిదారులు ఉన్నారని వారందరికీ చీరలు పంపిణి చేసేలా చర్యలు చేపట్టాలని  అన్నారు. జిల్లా లో రేషన్ షాప్ ల ద్వారా పంపిణి చేయాలనీ, మండలాలు , గ్రామాలలో తహసిల్దార్ల ఆధ్వర్యం లో పంపిణి జరగాలని  అన్నారు. జిల్లా పరిధి లో ఉన్న గోడౌన్ లలో చీరలను ఉంచి అక్టోబర్ 1 వరకు అన్ని మండలాలు , గ్రామాలకు డిస్ట్రిబ్యూషన్ చేయాలనీ అన్నారు. అదనపు కలెక్టర్ శ్రీ హర్ష అక్టోబర్ 2 నాడు చీరల పంపిణి ప్రారంభిస్తారని తెలిపారు.  మండలాలకు, గ్రామాలకు చీరలను ట్రాన్స్పోర్ట్ చేసే సమయం లో లోడింగ్ , అన్ లోడింగ్ లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా నుండి మండల  స్థాయి , మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు  మొత్తం ఎన్ని చీరలు పంపిణి చేశా రనేది రిపోర్ట్ ఉండాలని అన్నారు. లబ్దిదారులు రేషన్ షాప్ లలో ఆదార్ కార్డు లేక రేషన్ కార్డు ద్వారా చీర ను తీసుకునేలా రేషన్ డీలర్లు చూడాలని అన్నారు. లబ్దిదారుని సంతకం తీసుకున్న తరవాతనే చీరను పంపిణి చేయాలనీ అన్నారు. ఒక రేషన్ షాప్ లో ఎక్కువ మంది లబ్దిదారులు ఉంటే ఇంకో డిస్ట్రిబ్యూషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలనీ అన్నారు.

సమావేశం లో చేనేత జౌళి శాఖ  ఏ డి గోవిందయ్య ,  ఆర్.డి ఓ రాములు, డి.ఆర్.డి.ఎ ఉమా దేవి ,  ప్రసాద రావు, రేవతి తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారీ చేయడమైనది.

 

Share This Post