జిల్లా వైద్య అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్ (కరీంనగర్ జిల్లా)

సాధారణ ప్రసవాలు పెంచుటకు గర్భిణీలను ప్రోత్సహించాలి

అంగన్ వాడీ, ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలి

15-18 వయస్సు గల వారికి  రెండవ డోస్ వ్యాక్సినేషన్

పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

00000

జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుటకు గర్భిణీలు సాధారణ ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ వైద్యాధికారులకు సూచించారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లు, అధికారులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలో సిజేరియన్ కాన్పులు తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని ఆదేశించారు. వ్యాధి నిరోధక టీకాల వ్యాక్సినేషన్ 15-18 సంవత్సరముల వయసు గల వారికి రెండవ డోసు వ్యాక్సినేషన్ పెంచాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి సోమవారం, శుక్రవారం  గర్భిణీలకు పౌష్టికాహారం అందించాలని, సి.డి.పి.ఓలు, అశా వర్కర్లు. అంగన్ వాడీ టీచర్లు సిజేరియన్ ప్రసవాల వల్ల కలిగే,  నష్టాలను మరియు సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాల గురించి గర్భిణీలకు అవగాహన కల్పించాలని తెలిపారు. గర్భీణీలకు బీ.పి., షుగర్ రక్త పరీక్షలు ఎప్పటికప్పుడు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, సబ్ సెంటర్లకు ఐ.ఈ.సి. మెటీరియల్, అవగాహనకు సంబంధించిన పోస్టర్లను పంపిణీ చేయబడుతుందని అన్నారు. అంగన్వాడి మరియు ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలని కలెక్టర్  ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు జిల్లా పాలనాధికారి గరిమా అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జువేరియా, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, DCHS రత్నమాల, డాక్టర్ రవిందర్ రెడ్ది, డాక్టర్ అలీం, జిల్లా సమన్వయకర్త శివకృష్ణ, గైనకాలజిస్టులు, వైద్యాధికారులు, సిడిపిఓలు  మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

Share This Post