జిల్లా వైద్య అధికారులతో కలెక్టర్ సమావేశం

పత్రిక ప్రకటన, తేది: 09.08.2021
వికారాబాద్ జిల్లా :- సంవత్సరం లోపు చిన్న పిల్లలకు సంక్రామించే నిమొనియా అనే తీవ్రమైన శ్వాశకోశ వ్యాధి నుండి రక్షణ కొరకు నూతనంగా ప్రవేశపెట్టిన “న్యూమోకొకల్ కాంజు గేట్ ” (PCV) అను వ్యాక్సిన్ ను మూడు మొతాదులలో తీసుకున్నట్లయితే ఈ వ్యాధిని మరియు వ్యాధి ద్వారా సంక్రామించే మరణాలను నిరోధించగలమని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలియజేసినారు.
సోమవారం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి వైద్య అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 12న ఈ న్యూమోకొకల్ కాంజుగేట్ ( PCV) వాక్సిన్ జిల్లాలో అందుబాటులో రానున్నదని, ప్రతి ఒక్కరు తమ సంవత్సరం లోపు పిల్లలకు తీవ్రమైన నిమొనియా శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షించుకొనేందుకు తప్పకుండ ఈ వ్యాక్సిన్ ను వేయంచుకోవాలాని సూచించారు. క్షేత్ర స్థాయిలో ప్రజలలో ఈ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతో పాటు DRDA, DPO, ICDS, మెప్మా, మన్సిపల్ మరియు అన్ని సంక్షేమ శాఖలు తమతమ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచంచారు. ఈ వ్యాక్సిన్ పిల్లలకు 6 వారాలు, 14 వారాలు, 9 నెలలకు చొప్పున {3) మొతాదులలో వ్యాక్సినేషన్ చేయించుకోనేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ వ్యాక్సిన్ చాలా ఖరీదైనదని, ప్రభుత్వం దీనిని ప్రభుత్వ ఆసుపత్రులలో, PHC లు, CHC లలో ఉచితంగా వేయబడుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్ షిండే, Dy. DM&HO జీవరాజ్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, DEO రేణుకదేవి, DTDO కోటాజి, DSCDO మల్లేశం, మున్సిపల్, మెప్మా, రవాణా శాఖ అధికారులతో పాటు వైద్య అధికారులు పాల్గొన్నారు.

Share This Post