జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని షిఫ్ట్ చేయడానికి వీలుగా వైద్య సిబ్బంది క్వార్టర్స్ మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఆదేశించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 13:–
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని షిఫ్ట్ చేయడానికి వీలుగా
వైద్య సిబ్బంది క్వార్టర్స్ మరమ్మత్తులను త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో గల మెడికల్ స్టాఫ్ క్వార్టర్స్ మరమ్మత్తుల పురోగతిని పరిశీలించారు.
మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భవనాన్ని మెడికల్ కళాశాల వారికి అప్పగించనున్నందున ,
dm&ho కార్యాలయాన్ని క్వార్టర్స్ లోకి షిఫ్ట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సంబంధిత మూడు భవనాల మరమ్మతులను వారంలోపు పూర్తిచేసి అందజేయాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను మరో చోటికి తరలించడానికి సరిపడు భవనాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై సంబంధిత అధికారులను ఆయన ఆరా తీశారు.
వెల్నెస్ సెంటర్ దగ్గరలో ఏర్పాటు చేసిన నూతన పి ఎస్ ఏ ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇట్టి ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని డి సి హెచ్ ఎస్ డా. సంగారెడ్డి కలెక్టర్ కి వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయినందున త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా దృష్టి సారించాలని కోరారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రాజర్షి షా, ఆర్ అండ్ బి , పంచాయతీ రాజ్ ఈ ఈ లు,డి ఈ లు, టీ ఎస్ ఎం ఎస్ ఐ డి సి. ఈ ఇ, డి సి హెచ్ ఎస్ డా. సంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post