జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి, కీసర చౌరస్తాలో ఓటరు ప్రతిజ్ఞ చేయించిన ఆర్డీవో రవి, కీసరలోని అమరవీరుల స్థూపం వద్ద ఓటరు ప్రతిజ్ఞ,

జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి,
కీసర చౌరస్తాలో ఓటరు ప్రతిజ్ఞ చేయించిన ఆర్డీవో రవి,
కీసరలోని అమరవీరుల స్థూపం వద్ద ఓటరు ప్రతిజ్ఞ,
అమరవీరులస్తూపం వద్ద నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ,
బుధవారం 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని కీసరలోని అమరవీరులస్తూపం వద్ద ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం అక్కడ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు ,విద్యార్థులు, యువకులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆర్డీవో రవి మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ఇప్పుడు ప్రతి ఏడాదికి నాలుగు సార్లు ఓటరుగా నమోదుకు అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఓటరుగా నమోదుకు సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి బిఎల్ఓలను సంప్రదించి ఓటరు నమోదుకు ఫామ్ – 6 తో పాటు, ఫామ్ – 6బి ద్వారా ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోని, ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకొని మంచి ప్రజా ప్రతినిధులను ఎన్నుకున్నట్లయితే మన నియోజకవర్గాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి పరచుకోగలుగుతామన్నారు . ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్ రాగుల బాలయ్య,చిలుక గట్టయ్య ని ఘనంగా సన్మానించారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో డి సి ఓ ,శ్రీనివాసులు, జిల్లా యువజన సంక్షేమాధికారి బల్రామ్, కీసర తహాసిల్దార్ గౌరివస్థలా, కీసర సర్పంచ్ మాధురి, వైస్ జెడ్పీ చైర్మన్ బెస్త వెంకటేశ్,కీసర యంపిపి ఇందిరా, యండిఓ రమాదేవి, యంపిటిసిలు ప్రజా ప్రతినిదులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post