జిల్లా వ్యాప్తంగా ఆధార్కు ఓటరు జాబితాను వేగవంతం చేసి పూర్తి చేయాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

పత్రిక ప్రకటన–1 తేదీ : 01–09–2022
============================================
జిల్లా వ్యాప్తంగా ఆధార్​కు ఓటరు జాబితాను వేగవంతం చేసి పూర్తి చేయాలి
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి
ప్రభుత్వ సూచనల ప్రకారం ఓటరు జాబితాకు ఆధార్​ అనుసంధానం ప్రక్రియను మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం ఓటర్​ జాబితా – ఆధార్​ అనుసంధానంపై జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎలక్ట్రోరియల్​ రిటర్నింగ్​ అధికారులు (ఈఆర్​వో), మండలాల తహశీల్దార్లు, బూత్​ లెవల్​ ఆఫీసర్లతో టెలీకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ప్రభుత్వం సూచించిన మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఓటరు జాబితాకు ఆధార్​ను అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఆయా బూత్​ లెవల్​ అధికారులు (బీఎల్​వో) ఇంటింటికీ తిరిగి అనుసంధాన ప్రక్రియ చేపట్టాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని… త్వరగా పూర్తి చేయాల్సిందిగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు తెలుసుకొంటూ ఉండాలని అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి వివరించారు. అలాగే 6–బీ ఫారాలలో దరఖాస్తుదారులు ఆధార్​ను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​, జిల్లా కలెక్టరేట్​ ఏవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post