జిల్లా వ్యాప్తంగా ఇంటర్, పదో తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

పత్రిక ప్రకటన

తేదీ : 26–04–2022

జిల్లా వ్యాప్తంగా ఇంటర్, పదో తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇంటర్, పదో తరగతి పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మే 6వ తేదీ నుంచి  ప్రారంభం కానుండగా పదో తరగతి పరీక్షలు మే 23వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయని అందుకు సంబంధించి ఆయా పరీక్షల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముందుగానే పరీక్ష కేంద్రాలను సందర్శించడంతో పాటు అక్కడ ఉన్న వసతులను, ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను పరిశీలించాలని అదననపు కలెక్టర్ నర్సింహారెడ్డి సూచించారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తర్వాత అక్కడ తాగునీరు, విద్యుత్తు సరఫరా, గాలి, వెలుతురు, టాయిలెట్లు, పరిసరాల పరిశుభ్రత, వైద్య శిబిరాలు వంటి మౌలిక వసతులను కల్పించాల్సిందిగా ఆయన అధికారులకు వివరించారు. దీంతో పాటు  ప్రశ్నాపత్రాలు భారీ బందోబస్తుతో  పోలీసుల భద్రతతో ఆయా పరీక్ష కేంద్రాలకు  తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే  పరీక్షల సమయంలో నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా విద్యుత్తు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని అందుకు ఇప్పుడే ఏమైనా మరమ్మతులు ఉన్నట్లయితే వాటిని సరి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ కిట్  అందుబాటులో ఉంచడంతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ,  రవాణా శాఖ అధికారులు బస్సుల పనితీరును పర్యవేక్షించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. పరీక్ష  కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని 144 సెక్షన్ విధించాలని, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని  అన్నారు  పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించడం జరిగిందని, పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరీక్షలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.  పరీక్ష  కేంద్రాల పరిధిలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని 144 సెక్షన్ విధించాలని, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని  అన్నారు.  ఈ సమావేశంలో జిల్లా  ఇంటర్మీడియట్ అధికారి కిషన్,  జిల్లా విద్యాశాఖ అధికారిణి విజయకుమారి, ఆర్డీవో మల్లయ్య, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లుతో పాటు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post