*జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్*

నల్గొండ, సెప్టెంబర్ 17.ప్రభుత్వ ఆదేశాల ననుసరించి 18 సం. లు నిండిన ప్రతి ఒక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ నూరు శాతం పూర్తి చేయుటకు గ్రామ పంచాయతీ,పట్టణం ల్లో వార్డ్ వారీగా కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం లో మెప్మా రిసోర్స్ పర్సన్ లకు,నర్సింగ్ విద్యార్థులకు,ఏ.ఎన్. యం.లకు,ఆశా వర్కర్,అంగన్ వాడి టీచర్ లకు కోవిడ్ స్పెషల్ డ్రైవ్ పై నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీ లో 48 వార్డ్ లలో 48 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు,18 సం. లు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసు కోవాలని,డోర్ టు డోర్ సర్వే నిర్వహించి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే వ్యాక్సిన్ పూర్తి అయినట్లు స్టికర్ అంటించాలని,ఇంకా వ్యాక్సిన్ వేసుకొనని వారు ఉంటే వివరాలు సేకరించి కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రం లో వ్యాక్సిన్ వేయించాలని అన్నారు.కోవిడ్ ఆప్ లో వివరాలు ఎలా నమోదు చేసుకోవాలో వివరించారు. ఈ సమావేశం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్ రావు,నల్గొండ ఇంఛార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
*మిర్యాలగూడ పట్టణం లో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్*
మిర్యాలగూడ మున్సిపాలిటీ లో  వార్డుల వారీగా కోవిడ్ స్పెషల్ వ్యాక్సినేషన్ తీరును అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.మున్సిపాలిటీ లో 48  వార్డు సీతారాంపూర్,27 వార్డ్ శాంతి నగర్,23 వ వార్డ్ అశోక్ నగర్  లో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు.కౌన్సిలర్లు, నర్సింగ్ విద్యార్థులు,అంగన్ వాడి వర్కర్ లతో మాట్లాడారు. 18 సం. లు నిండి వ్యాక్సిన్ తీసుకోకుండా మిగిలిన వారికి  వ్యాక్సిన్ తీసుకునేలా  అవగాహన కలిగించాలని అన్నారు.  వ్యాక్సినేషన్ సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డిప్యూటీ డి.యం.హెచ్.ఓ.డా.రవి,ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ సాయి లక్ష్మీ,వైద్య అధికారులు ఉన్నారు.

Share This Post