జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్​ వేసుకునేలా చర్యలు మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి

జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్​ వేసుకునేలా చర్యలు
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి
మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ అందరికీ వేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాలోని కీసర, యాద్గిర్పల్లి, కుందన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (పీహెచ్​సీ) పరిశీలించారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు మొదటి విడత వ్యాక్సిన్​ ఎంత మంది వేయించుకొన్నారు ? రెండో విడత ఎంత మంది వేయించుకొన్నారనే వివరాలను సేకరిస్తున్న ఆశ వర్కర్లు, అంగన్​వాడీ టీచర్లు, ఆరోగ్య శాఖ సిబ్బందితో మాట్లాడి తెలుసుకొన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు వ్యాక్సిన్​ వేయించుకోని వారికి తప్పకుండా వేయించేలా చర్యలు చేపట్టడంతో పాటు మొదటి విడత వ్యాక్సిన్​ వేయించుకొని రెండో విడతకు సిద్దంగా ఉన్న వారికి తప్పకుండా కరోనా టీకాలు వేయించాలన్నారు. ఈ విషయంలో ఆశ వర్కర్లు, ఏఎన్​ఎమ్​లు, అంగన్​వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహిస్తున్నారని ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కరోనా టీకాలను వేయించుకోవాలని కోరారు

Share This Post