ఈనెల 26, 27 న, డిసెంబరు 3, 4 తేదీల్లో జిల్లాలో ప్రత్యేక క్యాంపులు,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఈనెల శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ విషయంలో ఆయా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వో)లు తప్పకుండా అందుబాటులో ఉండి నమోదు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు.
ఓటరు నమోదుకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు, సూచనల మేరకు ఈనెల 26, 27వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఓటరుగా నమోదు చేసుకొనేందుకు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఓటు హక్కు లేని యువతీ యువకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ మేరకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా ఈనెల 26, 27న, డిసెంబరు 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని దీనిలో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా వారి పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. దీనిలో భాగంగా రెండు రోజుల పాటు బూత్ లెవల్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ఓటరు నమోదు ప్రక్రియ నమోదు చేయాలని పోలింగ్ కేంద్రానికి ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. జిల్లా పరిధిలో ఓటరు నమోదు ప్రక్రియ పరిశీలించేందుకు తాను కానీ, ఈఆర్వో స్థాయి అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని ఆ సమయంలో బీఎల్వోలు తప్పకుండా అందుబాటులో ఉండాలని లేనట్లయితే చర్యలు తప్పవని కలెక్టర్ హరీశ్ హెచ్చరించారు. అలాగే జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాల వయసు నిండే ప్రతి యువతీ, యువకులను గుర్తించి గరుడ యాప్, ఓటరు–6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలని అందుకుగాను బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికి తిరిగి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించాలని కలెక్టర్ వివరించారు. దీంతో పాటుగా జిల్లాలో ట్రాన్స్జెండ్స్ను గుర్తించి వారిని సైతం ఓటరు జాబితాలో నమోదు చేయాలని పేర్కొన్నారు. అంగవైకల్యం ఉన్న ఓటర్లను గుర్తించి సదరం డేటా ద్వారా ఓటరు జాబితాలో చేర్చాలని అలాగే అంతకు జాబితాలో ఉన్న వారిని, కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకొన్న వారిని మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలో ప్రముఖుల పేర్లు తప్పిపోకుండా చూసుకోవాలని అలా జరిగినట్లయితే వారి పేర్లను నమోదు చేయాల్సిన బాధ్యత బూత్ లెవల్ అధికారులపై ఉంటుందని ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ హరీశ్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రంలోని రేఖాంక్షలు (లాంగిట్యూడ్), అక్షాంశాలు (లాటిట్యూడ్స్ ) గా తప్పనిసరిగా క్యాప్చర్ చేయాలని, సూపర్వైజర్లు ఈ విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి సూపర్వైజర్ వారి పరిధిలో కనీసం 10 శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, అలాగే ఈఆర్వో తమ పరిధిలో ఉన్న 10 పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని అంశాలను పరిశీలించి అర్హత ఉన్న వారందరూ ఓటరు జాబితాలో నమోదైనదీ, లేనిదీ పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు.
@@@@@@@@@@@
అంతకు ముందు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్, ఈఆర్వోలతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా కో–ఆపరేటివ్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.