జిల్లా వ్యాప్తంగా 2022 జనవరి 1, నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులందరు, ఈ నెల 30వ లోపు నూతన ఓటరుగా నమోదుచేసు కోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశము నిర్వహించారు. జిల్లా లోని పరకాల, వరంగల్ వెస్ట్ నియోజక వర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయన విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్సిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించామని అన్నారు. నవంబర్, 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించటం జరిగిందని, ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని అన్నారు. ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫోటో లేకపోవడం తదితర సాంకేతిక సమస్యలు ఉంటే ఓటర్ల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ నెల 2వ తేదీ నుండి ఆయా దరఖాస్తులను సరిచేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అయన వివరించారు.
ఓటరు జాబితాపై ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించేందుకు నవంబర్,6,7,27,28 తేదిలలో ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 20-2021 లోగా అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిష్కరించి జనవరి 05, 2022న తుది ఓటరు జాబితాను రూపొందించడం జరుగుతుందని పేర్కోన్నారు. ఎపిక్ ఓటరు కార్డు కొరకు వచ్చిన ధరఖాస్తులను పరిష్కరించి, ఈ ఎపిక్ కార్డు ల డౌన్లోడ్ కు సహకరించాలని అన్నారు. స్వీప్ కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ, చనిపోయిన వారి వివరాలను ఓటరు జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒటరు నమోదు కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రుపొందించి అమలు చేయుట కు సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు.
ఈ సమావేశంలో ఆర్ డి ఓ వాసుచంద్ర ఈవి శ్రీనివాసరావు (కాంగ్రెస్ పార్టి), ఆర్. అమరెందర్ రెడ్డి(బీజేపీ), ఈ. నాగేశ్వరరావు(టిఆర్ఎస్), ఏ. స్టెఫీన్(బీఎస్పీ), భిక్షపతి(సిపిఐ), కె. శ్యామ్ సుందర్(టిడిపి), రాజినికాంత్(వైఎస్ ఆర్ సిపి), ఎలక్షన్ సూపరింటెండెంట్ రాణి, డిటీలు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post