జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 31వ అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవ నిర్వహణ

వయోవృద్ధులకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలియజేసినారు.

ఈరోజు జిల్లా మహిళా, శిశు, దివ్యంగులు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 31 వ అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవాన్ని స్థానిక DPRC భావనంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వయోవృద్ధులు వృద్దప్య సమయంలో తమ యొక్క ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని సూచించారు. వయోవృద్ధుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తరఫున ఒక హెల్ప్ లైన్ నెంబర్ 14567 ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసినారు. వయో వృద్ధులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక యూనియన్ గా ఏర్పాటు కావడం వల్ల వాళ్లలో ఉన్న అభద్రతాభావం పోతుందని, ఈ వయసులో వారు చాలా సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి ఎటువంటి పట్టింపులకు పోకుండా కుటుంబసభ్యులతో కాలానుగుణంగా సంతోషంగా నడుచుకుంటే శేష జీవితం సుఖంగా గడిచిపోతుందని తెలియజేసినారు. ఈ సమయంలో వారు ఎదుర్కొనే సమస్యలకు ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ అన్ని విధాలుగా సహకారం ఉంటుందని, అలాగే ఎటువంటి సహాయం కావాలన్నా తమను సంప్రదించగలరని అదనపు కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా వయోవృద్ధులకు కౌన్సిలింగ్ చాలా అవసరమని, సమస్యల పరిష్కారానికి కౌన్సిలింగ్ తో పరిష్కరించుకోవచ్చని ఈ సందర్బంగా తెలియజేసినారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని (DWO) లలితాకుమారి, జిల్లా వైద్య అధికారి తుకారం, వికారాబాద్
ఆర్ డి ఓ ఉపేందర్ రెడ్డి, DSP సత్యనారాయణలతో పాటు వయో వృద్దుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రకాష్ రావు, జిల్లా జనరల్ సెక్రటరీ జూకరెడ్డి వయో వృద్దులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post