*జిల్లా సమగ్రఅభివృద్ధికి అందరూ కృషి చేయాలి.. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

వార్త ప్రచురణ
తేదీ.21.09.2021
ములుగు జిల్లా

జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియo లో మంగళ వారం రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య గారు మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు.

జిల్లా లో వ్యాక్సినేషన్ డ్రైవ్ రాష్ట్ర ప్రభుత్వం చాల ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని,ఈ కార్యక్రమంలో ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

రామప్పకు యునెస్కో గుర్తింపు రావడం వలన అంతర్జాతీయంగా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని అన్నారు.

రామప్ప లోని తూర్పు గేటు ద్వారం , మరియు హైలెవల్ బ్రీడ్జ్ కి డిపిఆర్ తయారీ చేయవలసి ఉందని కలెక్టర్ అన్నారు. లక్నవరం లో రెండో బండ్ పనులు కు అనుమతులు వచ్చాయని కలెక్టర్ అన్నారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి గుర్తించిన స్థలంలో భవన నిర్మాణం మ్యాప్ ను పరిశీలన జరిగిందని, నెల చివరి వరకు టెండర్లు వేయడం జరుగుతుందని వారు అన్నారు.

 

Share This Post