జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి సర్వత్ర కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

ప్రచురణార్ధం

జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి సర్వత్ర కృషి చేస్తున్నాం

జనగామ, సెప్టెంబర్,17.

జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి సర్వత్ర కృషి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు.

శనివారం కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలలో మంత్రి జడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య, డిసిపి సీతారాం, మున్సిపల్ చైర్మన్ పోకల జమున లతో పాల్గొని జాతీయ పతాకం ఎగురవేసి, పోలీస్ శాఖ వారి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలను మంత్రి తిలకించారు.

ఈ సందర్భంగా మంత్రి జిల్లా అభివృద్ధిని శాఖల వారీగా వివరిస్తూ…జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి సర్వత్ర కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు.

జిల్లా లోని మహిళా సంఘాలకు స్వయం ఉపాధికి బ్యాంక్ సహకారంతో చిన్నతరహా పరిశ్రమలు నెలకొల్పి మహిళల ఆర్ధిక ప్రగతికి బాటలు వేస్తామన్నారు.

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల నిర్వహణపై వివరిస్తూ 1948, సెప్టెంబర్ 17వ తేదీన 74 సంవత్సరం ల క్రితం మన తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం అయ్యిందని, రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్యం తెచ్చుకోవడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో జనగామ జిల్లాను అగ్రగామిగా నిలబెట్టేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో జనగామ జిల్లాలో 77వేల262 ఎకరాల కు నీరందేదని, తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భావం తో 3లక్షల 61వేల 493 ఎకరాలు నీరందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా జరుపుకుంటున్నామన్నారు.

వేసవికాలంలో నూ చెరువులు నింపడం, 62 రైతు వేదికలు నిర్మించి రైతు పక్షపాతిగా సి.ఎం.నిలిచారన్నారు.

అంతేగాక 2018 నుండి 2022 వరకు 1లక్ష68వేల 447మంది రైతులకు 1559.73కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాలలో జమచేయడం జరిగిందన్నారు.

2019మంది రైతులకు101 కోట్ల బీమా అందజేయడం జరిగిందన్నారు.

మిషన్ కాకతీయ తో965 చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. సాగులోవున్న 51 వేల ఆయకట్టును దేవాదుల ప్రాజెక్ట్ ను 865 కోట్లతో 3.59 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నట్లు పేర్కొన్నారు.

మిషన్ భగీరధతో ఇంటింటికి సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో జిల్లాలోని 611 ఆవాసాలకు రూ.840 కోట్లతో విజయవంతం గా సరఫరా చేస్తున్నామన్నారు.

వైద్యశాఖ ద్వారా లక్ష్యాలకు మించి 5,190 కాన్పులు చేయించామన్నారు. తెలంగాణ వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు 18,161 కే.సి.ఆర్. కిట్ లు అందజేయడం జరిగిందన్నారు.

మార్చురీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు నిర్మిస్తున్నాం. పారిశుద్యం లో 8వ స్థానం సాధించడమే గాక 3 లక్షల ప్రత్యేక నగదు ప్రోత్సాహం అందుకోవడం జరిగిందన్నారు.

డయాలసిస్, రేడియాలజీ వంటి సదుపాయాలు కల్పించాం.

జనగామ కు 190 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటుకు మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు.

గ్రామీణ అభివృద్ధిలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 12 మండలాల్లోని 281 గ్రామపంచాయతీలలో ఒక లక్ష 31 వేల 519 కుటుంబాలకు జాబ్ కార్డులు అందజేసి 62 వేల 52 కుటుంబాలకు 27 లక్షల 79 వేల పని దినాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు.

జిల్లాలోని 11,560 సంఘాలకు 1585 కోట్ల రూపాయలను రుణాలు అందించాం శ్రీనిధి క్రింద 9965 సంఘాలకు 365 కోట్ల రూపాయలను రుణాలు మంజూరు చేశారు సేర్ఫ్ ద్వారా 52 వేల 295 మంది మహిళా సభ్యులకు వంద కోట్లను వడ్డీ లేని రుణాలు అందజేశాం 627 మహిళా సంఘ సభ్యులకు ఆహార ఉత్పత్తుల తయారీ కేంద్రాలకై మూడు లక్షలు అందజేశాం.

జిల్లాలోని రఘునాథపల్లి నర్మెట్ట పాలకుర్తి మండలాల్లో మహిళా సంఘాలతో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కంపెనీలను ఏర్పాటు చేయడం జరిగింది.

తెలంగాణ హరితహారం క్రింద 31 లక్షల మొక్కల నాటేందుకు లక్ష్యాలకు పెట్టుకొని 35 లక్షల మొక్కలు నాటాం 281 వైకుంఠధామాలను పూర్తి చేశాం 430 రైతు కల్లాలు పూర్తి చేసాం 206 క్రీడ ప్రాంగణాలను పూర్తి చేసాం

జిల్లాలో 64,686 మందికి 15 కోట్ల 30 లక్షల రూపాయలు పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం 65 సంవత్సరంల నుండి 57 సంవత్సరం ల వరకు వయోపరిమితి తగ్గించి అర్హులైన పదివేల మందికి 8358 మంజూరు చేసి 18522 కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది.

24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును నిరంతరంగా సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు కొత్త వ్యవసాయ కనెక్షన్లు విడుదల చేయడానికి 13 కోట్ల ఖర్చుతో ఆరు వేల డి టి ఆర్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు 13వేల విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాము.

పశువు వద్ద శాఖ ద్వారా కులవృత్తులను ప్రోత్సహించడానికి గొల్ల కురుమల అభివృద్ధి కొరకు రాష్ట్రం పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టి 212 కోట్లతో 16 వేల గొర్రెల యూనిట్లు మంజూరు చేశాం 5000 మంది లబ్ధిదారులకు పాడి పశువుల అంద చేశాం

ఉద్యాన శాఖ ద్వారా రైతులకు స్థిరాదాయాన్ని అందించే ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం

మత్స్య శాఖ ద్వారా 9 రిజర్వాయర్లు 723 చెరువులు లలో మూడు కోట్ల చేపల విత్తనాలను విడుదల చేసేందుకు ప్రాణాలికబద్ధంగా కృషి చేస్తున్నాం స్టేషన్ ఘనపూర్ లో 10 లక్షల రూపాయలతో చేపలు మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం

దళిత బంధు పథకం కింద జిల్లాలో 18 .50 కోట్లతో 155 యూనిట్ల ను మంజూరు చేసి దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాం మినీ డైరీ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఒక యూనిట్ కి నాలుగు లక్షల చొప్పున 562 మంది లబ్ధిదారులకు పాడి గేదలు ఇవ్వడం జరిగింది.

వెనుకబడిన తరగతుల సంక్షేమం క్రింద 250 యూనిట్ల వరకు నాయి బ్రాహ్మణులకు రజకులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం

కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల క్రింద 17వేల మందికి 170 కోట్ల రూపాయలను అందజేశాం.

రెండు పడక గదుల ఇండ్ల పనులు జిల్లాలో శరవేగంగా జరుగుతున్నాయి 4239 గృహాలకు గాను 3286 గృహాలను నిర్మాణ దశలో ఉండగా 953 పూర్తి చేసి 414 గృహాలు లబ్ధిదారులకు అందజేశాం.

జిల్లాలో పర్యటక శాఖ క్రింద బమ్మెర పాలకుర్తి వాల్మిడి పెంబర్తి కిలాసాపూర్ జఫర్గడ్ ప్రాంతాలను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు 55 కోట్లతో సమగ్ర అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

రోడ్లు భవనాలు శాఖ కింద 20 కోట్లతో పనులు చేపట్టాం పనులు నిర్మాణ దశలో ఉన్నాయి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా 99 కోట్లతో పనులు చేపట్టగా వివిధ అభివృద్ధి దశలో ఉన్నాయి.

జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి భవనాల నిర్మాణం చేపడతాం జిల్లా అభివృద్ధిని అంచలంచలుగా చేపడుతూ సమగ్ర అభివృద్ధి పరుస్తాం అనంతరం

సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అద్భుతంగా ప్రదర్శించిన కీర్తన చిన్నారులను మంత్రి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ఆర్డీవో మధుమోహన్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు పోలీస్ శాఖ సిబ్బంది కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post