జిల్లా సైన్స్ మ్యూజియం ప్రారంభానికి సిద్ధం….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

పత్రికా ప్రకటన
సంగారెడ్డి ,సెప్టెంబర్ 13:–
జిల్లా సైన్స్ మ్యూజియం ప్రారంభానికి సిద్ధం….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

జిల్లాలో నూతనంగా నిర్మించిన సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియం త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

సోమవారం ఆయన అదనపు కలెక్టర్ రాజార్షి షా తో కలిసి సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియం, జిల్లా సైన్స్ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. సైన్స్ మ్యూజియం అంతా కలియతిరిగి ఒక్కొక్కటిగా పరిశీలించారు. జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్ ఆయా ఏర్పాట్లు, వాటి పనితీరు పై కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల మెదడుకు పదును పెట్టే విధంగా సైన్స్ మ్యూజియం ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. చిన్న పిల్లలకు సైతం ఆసక్తిగొలిపేలా, సైన్స్ మ్యూజియం ఉందని కితాబు నిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే జిల్లాలో మొదటిదిగా సర్ సివి రామన్ సైన్స్ మ్యూజియం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు.

కలెక్టర్ వెంట జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులు, ఏపీ డి లు, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్ , మరియు డీసీఈబీ సెక్రెటరీ లిం బాజీ , తదితరులు పాల్గొన్నారు.

Share This Post